
ఇంకొంతమంది తల్లిదండ్రులను ఇంట్లోనే పెట్టుకొని బాగా చూసుకుంటున్నాము అంటూ బయటికి కవరింగ్ ఇస్తున్నప్పటికీ.. కనీసం ఇక వృద్ధాప్యంలో మంచాన పడిన తల్లిదండ్రులు మనుషుల్లా కూడా చూడటం లేదు చాలామంది ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నబిడ్డలు సరిగా చూసుకోవడం లేదని 90 ఏళ్ళ వృద్ధుడి మనసు ఎంత బాధ పడిందో ఏమో చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా తండ్రి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.ఎంతోమంది మనసులను కదిలిస్తున్న ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో వెలుగులోకి వచ్చింది.
కంఠాయ పాలెం కు చెందిన చిన్న సాయిలు అనే 90 ఏళ్ల వృద్ధుడుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహం జరిగిపోయింది. ఇక ఇద్దరు కుమారులు కూడా కూలి పనులు చేసుకుంటున్నారు. ఇక భార్య మరణించడంతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు సదరు వృద్ధుడు. ఇక ఇటీవల అనారోగ్యం బారిన పడగా అటు కొడుకులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇక తనను ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత కూడా కొడుకుల తీరులో మార్పు రాలేదు. దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. చివరికి గ్రామ పెద్దలు కలుగజేసుకోవటం తో బలవంతంగా కుమారులు ఇద్దరు తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.