కరోనా వైరస్ కష్టకాలంలో వైద్యులే ప్రాణాలు పోసే ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు. ఈ క్రమంలోనే డాక్టర్లను ఎంతోమంది అమితంగా గౌరవించడం మొదలుపెట్టారు. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా ఉంది అనే చెప్పాలి.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడి డాక్టర్లు పరీక్షించి చనిపోయింది అంటూ ధృవీకరించడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక వైద్యుల మాటలపై నమ్మకం కుదరక మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్ బతికే ఉందని చికిత్స అందించి కోలుకునేలా చేశారు. ఇది కాస్త సంచలనంగా  మారిపోయింది అని చెప్పాలి. జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్కు చెందిన అర్చనకు మునిపల్లి మండలం తాటి పల్లి కి చెందిన యువకునితో వివాహం జరిగింది. ఇటీవల ఉపవాస దీక్ష చేపట్టింది అర్చన.  కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.వెంటనే భర్త అర్చన తల్లిదండ్రులకు సమాచారం అందించారు. జహీరాబాద్ లోని ప్రభుత్వ  ఆసుపత్రికి తీసుకొచ్చారు.


 ఇక అక్కడ డ్యూటీలో ఉన్న జనరల్ సర్జన్ సంతోష్ పరీక్షించి చనిపోయినట్లు ఒక చీటీ తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. కానీ డాక్టర్ చెప్పింది నమ్మని  అర్చన తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి  బ్రతికే ఉందని నిర్ధారించి  చికిత్స అందించారు. ఆమెకు ప్రాణం పోసారు. ప్రభుత్వ వైద్యుల  నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము అంటు ఆరోపిస్తూ తల్లిదండ్రులు న్యాయం చేయాలని కోరుతున్నారు. మొదటి చనిపోయిందని చీటీ ఇచ్చిన  డాక్టర్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవ్వటంతో మరోసారి పరీక్షించి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలి అని చీటి ఇచ్చారు. కానీ ఒక చీటీని దాచి మరో చీటిని చూపించి ఆరోపణలు చేస్తున్నారని వైద్యుడు ఆరోపిస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: