ఆడ మగ అనే తేడా నేటి సభ్య సమాజంలో ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఇటీవలే కాలంలో మాత్రం అటు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని చెప్పాలి. చదువుల్లో వ్యాపారాల్లో కూడా పురుషుల కంటే ఒక అడుగు ముందే ఉన్నారు మహిళలు. ఇలా ఎంతో మంది మహిళలు మహిళా సాధికారతవైపు అడుగులు వేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ఇలాంటి నేటి ఆధునిక సమాజంలో కూడా ఆడ, మగ అనే వివక్ష ఇంకా కొనసాగుతుంది అన్నదానికి నిదర్శనంగా నిలిచే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఏకంగా ముఖం కూడా చూడకుండానే శిశువుని ముళ్ళ పొదల్లో పడేసిన ఘటనలు వెలుగులోకి వస్తే.. ఇక ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అన్న కారణంతో కోడలిని అత్తింటి వారు ఇంటి నుంచి వెళ్లగొడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.


 తొలిచూరిలో ఆడపిల్ల పుట్టింది అన్న కారణంతో చివరికి కోడలని అత్తింటి వారు కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం కనగర్తి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ పుష్పలత దంపతులు కుమార్తె అయిన స్పందనను జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కిరణ్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో భారీగానే కఠిన కానుకలు ముట్ట చెప్పారు. దంపతులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే స్పందన కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళగా.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆడపిల్ల పుట్టిందని భార్య మొహం చూసేందుకు కూడా ఇష్టపడలేదు భర్త కిరణ్. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగిన అత్తింటి వారిలో మార్పు రాలేదు. ఆమెని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ న్యాయపోరాటం చేస్తుంది సదరు మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి: