
గతంలో ఎన్నో ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు అని నెపం తో దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చేవి. అయితే ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనలు తగ్గినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలతో దాడులకు పాల్పడుతున్న వారు లేకుండా పోలేదు. ఇటీవల ఝార్ఖండ్లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజలు చేస్తున్నారు అన్న ఆరోపణలతో ఏకంగా వృద్ధ దంపతులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు స్థానికులు. ఈ ఘటనలో వృద్ధ దంపతులు ఇద్దరు కూడా దెబ్బలకు తాళలేక చివరికి ప్రాణాలు కోల్పోయారు.
ఝార్ఖండ్ రాష్ట్రంలోనే లాతేహార్ జిల్లా చంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. గ్రామస్తులకు విరుద్ధంగా చేతబడి చేస్తున్నారు అని ఆరోపణలతో ఒక వృద్ధ జంటను స్థానికులు దారుణంగా కొట్టారు.దాదాపు 12 మంది ఇలా విచక్షణ రహితంగా దాడి చేసినట్లు పోలీసులకు విచారణలో తేలింది. అయితే గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఆ వృద్ధ దంపతులను క్షుద్ర పూజల ఆరోపణలతో కర్రలతో తీవ్రంగా కుట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలోపడ్డారు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.