విధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలు మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమే అని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత మృత్యువు.. ఏ క్షణంలో ఎప్పుడు కబలిస్తుంది అన్నది ఊహకందని రీతిలోనే ఉంటుంది. కానీ రేపు బాగుంటుంది అనే చిన్న ఆశతోనే ప్రతి మనిషి కూడా జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే మనుషుల ప్రాణాలను తీసేందుకు ఎన్నో ప్రాణాంతకమైన వైరస్లు దూసుకు వస్తున్నాయి.


 ఇలాంటి సమయంలో మనుషులే చేజేతులారా ప్రాణాలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మరికొన్ని ఘటనల్లో సడన్ హార్ట్ ఎటాక్లతో చూస్తూ చూస్తుండగానే ప్రాణాలు పోతున్నాయి. ఇవేవీ చాలవు అన్నట్లు వీధి కొంతమంది జీవితాలలో ఆట ఆడుతూ ఊహించని రీతిలో మృత్యువు దరిచేరేలా చేస్తూ ఉంటుంది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తూ ఉంటుంది విధి. ఇక్కడ ఒక చిన్నారి విషయంలో విధి కనికరం లేకుండానే వ్యవహరించింది. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలుడు విషయంలో ఉయ్యాలనే మృత్యువుగా మారేలా చేసింది విధి.


 ఈ విషాదకర ఘటన కాకినాడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కాజులూరు మండలం గొల్లపాలెం లో 11 ఏళ్ల బాలుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. అంగన్వాడీ కేంద్రంలో ఉయ్యాల ఊగుతుండగా బాలుడు మెడకు తాడు బిగుసుకుపోయింది. అయితే ఆ సమయంలో ఎవరు గమనించకపోవడంతో.. చివరికి ఊపిరాడక 11 ఏళ్ల బాలుడు మనోజ్ చంద్రశేఖర్ ప్రాణాలకు కోల్పోయాడు. అయితే అంగన్వాడీ కేంద్రానికి తన చెల్లెలితో పాటు వెళ్ళాడు మనోజ్. అంగన్వాడీ టీచర్ అక్కడ లేని సమయంలో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. అయితే ప్రాణంగా పెంచుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు అరణ్య రోదనగా  విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: