ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి బిజీ బిజీగా మారిపోయాడు. దీంతో కనీసం ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా సమయం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు వ్యాపారం ఉద్యోగం అంటూ బిజీ బిజీగా ఉండేవారు.. ఇక ఇంట్లో పనులు చేసుకోవడం కోసం పనిమనిషిని పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పనిమనిషి ఇక ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచి.. పాత్రలను కడిగి శుభ్రంగా భద్రపరచాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పనిమనిషి మాత్రం ఇవన్నీ చేయడానికి ఇంట్లో చేరి చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా జుగుప్సాకరమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా మూత్రం కలిపిన నీటితో ఫ్లోర్ శుభ్రం చేస్తుంది ఈ పనిమనిషి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం అటు సీసీటీవీలో రికార్డు కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియోను సాక్ష్యంగా అందిస్తూ ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పని మనిషిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. చేసిన తప్పును ఒప్పుకుంది ఆమె. అసలేం జరిగిందంటే గ్రేటర్ నోయిడా లోని అజ్నారా హోమ్స్ సొసైటీ లోని ఒక ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.


 ఇంటి యజమానులు ఎప్పుడు పనుల్లో బిజీబిజీగా ఉంటారు. ఈ క్రమంలోనే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచేందుకు ఒక పనిమనిషి నియమించారు. ఆమెకు మంచి వేతనం కూడా ఇస్తున్నారు. కానీ ఆమె ఇంటిని క్లీన్ చేయడం మానేసి ఏకంగా దారుణంగా ప్రవర్తించింది. ఫ్లోర్ క్లీన్ చేసే క్లాత్ పై మూత్రం పోసి.. అదే క్లాత్ ను బకెట్లో నీళ్లలో ముంచి ఇల్లును శుభ్రం చేయడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇక ఇంటి యజమాని అనుమానం వచ్చి సిసి టివి ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం అర్థమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: