కావాల్సిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్- అరకిలో
నువ్వులు- నాలుగు టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్- ఒకటి
ఉల్లికాడలు-  నాలుగు
నూనె- తగినంత

 

ఉప్పు- సరిపడినంత
సోయాసాస్- ఒక టేబుల్ స్పూను
పచ్చిమిర్చి తురుము- టీస్పూను

 

అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను
కార్న్ ఫ్లోర్- రెండు టీస్పూనులు
నిమ్మరసం- ఒక టీస్పూను

 

తయారుచేసే విధానం:
ముందుగా చికెన్ చిన్న చిన్న‌ ముక్కలుగా క‌ట్ చేసి బాగా కడిగి నీళ్లు లేకుండా వార్చి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆ చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం, సోయాసాస్, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నాలుగు గంట‌లు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత తీసి వండడానికి బయటపెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులోనే నువ్వుల్ని వేసి కొన్ని సెకన్ల పాటూ వేయించాలి. 

 

తరువాత మారినేషన్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి బాగా వేయించి బయటికి తీయాలి. తీసేశాక మిగిలిన నూనెలో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేయించాలి. అవి వేగాక… వేయించిన చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. ఒక అయిదు నిమిషాల పాటు మ‌గ్గ‌నిచ్చి స్టవ్ కట్టేయాలి. అంతే నువ్వుల చికెన్ కర్రీ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: