
ఉసిరి రసం.. తినడానికి ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఈ ఉసిరి రసంను మీరు ఎప్పుడైనా తిన్నారా ? ఎలా చేసుకోవాలో తెలుసా ? ఎలా చేసుకుంటే బాగుంటుందో తెలుసా ? అసలు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఉసిరి రసం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ చదవండీ.
కావాల్సిన పదార్ధాలు..
కందిపప్పు - అరకప్పు,
ఉసిరికాయలు - ఐదు,
మిరియాలు, జీలకర్ర పొడి - టీస్పూను,
పచ్చి మిరపకాయలు - నాలుగు,
కరివేపాకు - తగినంత,
ఇంగువ - చిటికెడు,
అల్లంవెల్లుల్లి పేస్టు - టీస్పూను,
కొత్తిమీర - టేబుల్ స్పూను,
ఆవాలు - పావుస్పూను,
నూనె - టీస్పూను,
పసుపుపొడి - అర టీస్పూను.
తయారీ విధానం..
ఉసిరి కాయల నుండి గింజలు తీసి ఆ ఉసిరి కాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వాటిలో ముప్పావు కప్పు నీళ్లు పోసి పేస్టులా తయారు చేయాలి. ఆతర్వాత ఆ పేస్ట్ లో నుండి రసాన్ని తీసి ఒక గిన్నెలో పోయాలి. ఆతర్వాత ఉడికిన పప్పు, ఉసిరి రసం, జీలకర్ర, మిరియాల పొడులతోపాటు పసుపు పొడి కూడా ఒక గిన్నెలో వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆతర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి.
కరివేపాకు, పచ్చిమిరపకాయలు తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, ఇంగువలను అందులో వేసి చక్కని సువాసన వచ్చేదాకా వేగించాలి. ఆతర్వాత అందులో పప్పు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. రసం కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి, సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీరను చల్లి అన్నంలో వేడిగా కలుపుకుతింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రసం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. రుచిని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఉసిరి రసం అప్పుడప్పుడు తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.