ఇంత టెక్నాలజీ పెరిగిన, సాంకేతికంగా అభివృద్ధి సాధించినా ప్రజలు ఇంకా  మంత్రాలు, తంత్రాలు స్వామీజీల పేరుతో అనేక పూజలు చేస్తూ  వారి వలలో పడి మోసపోతున్నారు. ఇలా  ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని  ఎంతోమంది స్వామీజీలు ఎంబిబిఎస్ చేసిన డాక్టర్ ల కంటే ఎక్కువగా ఫీల్ అయి పోతూ తాయత్తులు, నిమ్మకాయ లాంటివి ఇస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమందేమో పూజల పేరుతో  ఎంతో మంది మహిళలను అఘాయిత్యం చేస్తున్నారు. వారు దేవుళ్లు అయినట్టు వారి ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు ప్రజల్ని నమ్మిస్తూ వారి సంపాదన పెంచుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే  రాజకీయ నాయకులు కూడా వారి పాదాల చెంత చేరి ఏ విధంగా పాలించాలని కూడా వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకంటే దారుణం ఏ దేశంలో లేదు. ఒకటి ఏమిటంటే ఈ స్వామీజీలకు బాబాలకు అన్ని శక్తులే ఉంటే కరోణతో అంతమంది చనిపోతున్నా దానికి మందులు ఎందుకు కనీ పెట్టలేదు. ఎందుకు ప్రజల ప్రాణాలను కాపాడడం లేదు.

ఎందుకు ప్రమాదం  వస్తుందని ముందుగా చెప్పలేదు. వీరి మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది నిజమైన అంశం వారికి కూడా తెలుసు.  విక్రమార్కుడు సినిమాలో  రవితేజ అయితే ఏ విధంగా ప్రజలను నమ్మించి అందరికీ సగం గుండు గీసాడో.. ఆ విధంగానే  మన సమాజంలో బాబాలు, స్వామీజీలు  మన సమస్యలను ఆసరాగా చేసుకుని వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. మన దేశంలో సైన్సు కన్నా ఎక్కువ ఈ బాబాలను స్వామీజీలను నమ్ముతారు. డాక్టర్ల కంటే కూడా స్వామీజీల నమ్మేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారంటే మనందరం  నవ్వుకునే విషయమే. చదువుకున్నవారిది అదే పరిస్థితి.. చదువు రాని వారికి అదే పరిస్థితి.  మన యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గ్రామానికో బాబా, స్వామీజీ పుట్టుకొస్తున్నారు. ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పూజలు, దోషాలు పోగొట్టేస్తామని చెబుతూ అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి  అందినకాడికి దోచుకుంటున్నారు. అచ్చం దైవాంశ సంభూతుల్లా, బాబాల  వారి వేషాలు మార్చుకొని చాలా తేలికగా ప్రజలను మోసం చేస్తూన్న ఒక ముఠా విజయనగరం జిల్లాలోనే పట్టుబడింది.

ఎస్ కోట మండల పరిధిలోని ముసిడీపల్లి గ్రామంలో కొద్దిరోజులుగా దొంగ స్వాముల ముఠా తిష్ట వేసుకుని కూర్చుంది. అమాయకమైన జనాలను పూజలు చేసి మీ కష్టాలు పోగొట్టేస్తామని చెప్పి బంగారు వెండి నాణాల ప్రతిమలు చూపించి వారిని నమ్మించారు. మీ జాతకంలో గ్రహాల వంకరగా ఉన్నాయని చెబుతూ ఇంటింటికి వెళ్లి ప్రజలను భయపెట్టారు. ప్రజలు కూడా దొంగ స్వాముల యొక్క మాటలు నమ్మి కూలి చేసి కూడబెట్టుకున్న డబ్బులను వారికి అప్పజెప్పారు. ఇలా గ్రామంలో చాలా మంది నుంచి 9 నుంచి 10 వేల రూపాయలను ఈ ముఠా వసూలు చేసింది. ఇలా ఇంకా కొంతమందిని డబ్బులు అడిగే ఎందుకు ప్రయత్నం చేసింది. అయితే ఆ గ్రామంలో వీరి యొక్క ప్రవర్తనపై కొంతమందికి అనుమానం వచ్చి అక్కడే ఉన్నటువంటి ఆ దొంగ స్వాములను ఆలయానికి కట్టేసి దేహ శుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: