దాంతో, కొత్తగా వచ్చిన యంగ్ హీరోయిన్‌లకు పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఎంట్రీ అంటే కెరీర్‌కే టర్నింగ్ పాయింట్. కానీ ఇటీవల కాలంలో అలాంటి ఛాన్సులు కొత్త అమ్మాయిలకు చాలా అరుదుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంతో సోషల్ మీడియాలో ఓ కొత్త డిస్కషన్ మొదలైంది.అందులో చాలా మంది నెటిజన్లు “సీనియర్ హీరోలు కొత్త హీరోయిన్‌ల్ని సెట్టవ్వనివ్వడం లేదు… వాళ్లే మళ్లీ మళ్లీ అదే హీరోయిన్‌లను ఎంచుకుంటున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కథా అవసరం, స్క్రీన్ ప్రెజెన్స్, ఆడియన్స్‌కి యాక్సెప్టబిలిటీ వంటి అంశాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. కొత్త ముఖాలను తీసుకోవడం రిస్క్ అనిపించడం వల్లే, సీనియర్ హీరోలు పరీక్షించబడిన హీరోయిన్‌లను రిపీట్ చేయడం జరుగుతోందని కొందరి అభిప్రాయం.
ఇక ఇండస్ట్రీలోని మరో వర్గం చెబుతోందేమంటే — ఈ ప్రాక్టీస్ వల్ల భవిష్యత్తులో హీరోయిన్ల క్రైసిస్ మరింత పెరగొచ్చని. కొత్త అమ్మాయిలకు అవకాశాలు దొరకకపోవడం వల్ల, టాలీవుడ్‌లో ఫ్రెష్ కంపినేషన్లు తగ్గిపోతున్నాయనీ, అదే ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద, సీనియర్ హీరోలకు కొత్తరకమైన తలనొప్పి మొదలైందంటూ సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలో మారుతున్న అవుట్‌పుట్, కథల డిమాండ్, హీరో–హీరోయిన్ కాంబినేషన్ల సేఫ్టీ జోన్… ఇవన్నీ కలిసి పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి