ఆ హీరోయిన్ మరెవరో కాదు… అలియా భట్. ఇప్పటికే రాజమౌళితో ఆర్ఆర్ఆర్ లో ఆయనతో పని చేసిన అనుభవం ఉండటంతో ఈ కీలక పాత్రకు అలియా భట్ అద్భుతంగా సరిపోతుందని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నేరేషన్ కూడా పూర్తయ్యిందని, అలియా ఈ పాత్రలో కనిపిస్తే సినిమాలో మరో ఎక్స్‌ట్రా గ్లామర్ మరియు భావోద్వేగం రెండు ఉన్నాయి అని .. కానీ చివరి దశలో అలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కారణం — కాల్ షీట్లు. ఈ సినిమాకు కావలసిన లాంగ్ షెడ్యూల్స్, ప్రత్యేకంగా విదేశీ షూట్‌ల కోసం ఆమె దగ్గర క్లియర్ డేట్స్ లేవట. ఇప్పటికే సైన్ చేసిన మరో పెద్ద ప్రాజెక్ట్‌తో షెడ్యూల్‌లు క్లాష్ కావడంతో, ఎంత ప్రయత్నించినా రాజమౌళి టీమ్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేకపోవటంతో అలియా ‘మందాకిని’ పాత్రను వదులుకోవాల్సి వచ్చిందట.
అభిమానులు మాత్రం “మందాకిని పాత్రకు అలియా భట్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేది” అని ఇంకా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో, ప్రియాంక చోప్రా వచ్చాక ఆ పాత్రకి మహత్తరమైన వయసు, గంభీరత, ఓ రాయల్ ఫీలింగ్ వచ్చిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా… అలియా భట్ రిజెక్ట్ చేసిన చోట ప్రియాంక చోప్రా రావడంతో వారణాసిపై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. మహేష్–ప్రియాంక కాంబినేషన్ ఎలా ఉండబోతోందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి