భారతదేశంలో సంప్రదాయాలకు ఎంతో ఇంపార్టెంట్ ఇస్తారు. ముఖ్యంగా అత్యధికంగా పిల్లల్ని కనే వారిలో భారతీయులే ఎక్కువగా ఉండేవారు. పూర్వకాలంలో మన తాతలు వాళ్ల తాతలు ఒక్కొక్కరు ఐదు నుంచి పదిమందిని కనేవాళ్ళు.. వారికి పిల్లల్ని కనడానికి ఒక టైమ్ అంటూ ఏమీ ఉండేది కాదు. ఎంతమందిని కన్నా వాళ్ళు యాక్టివ్  గానే ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి అయిన యువతీ యువకులు పిల్లల విషయంలో చాలా సంయమనం పాటిస్తున్నారు. కొంతమంది పెళ్లయిన కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి పిల్లల్ని కంటున్నారు. మరి కొంతమంది ఒకరిని కని, ఆ తర్వాత గ్యాప్ ఇస్తున్నారు. అంతేకాదు ఇలా పిల్లలు జన్మించకుండా ఉండడం కోసం రకరకాల ప్రికాషన్స్ వాడుతూ ఉంటారు. ఇందులో ఒకటి కండోమ్. భార్యాభర్తలు కలిసి ఉన్నా కానీ పిల్లలు పుట్టకుండా నిరోధించవచ్చు.

 ఇదే కాకుండా ప్రస్తుత కాలంలో చాలామంది  ఈ కండోమ్స్ వినియోగించడం లేదట. వీటి అమ్మకాలు కూడా తగ్గిపోయాయట. దీనికి కారణం ఏంటో చూద్దాం..అయితే ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం డాక్టర్ దగ్గర చూపించుకొని కాపర్ టీ, లేదంటే గర్భ నిరోధక మాత్రలు వాడేవారు. ఇంకొంతమంది కండోమ్ ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో కండోమ్ వినియోగం తగ్గిపోయి గర్భనిరోధక మాత్రల వినియోగం పెరిగిందట. డాక్టర్లు ఈ మాత్రలు వాడవద్దని ఎంత చెప్పినా ఎవరు వినడం లేదట.. దేశంలో ఏటా 35 మిలియన్ యూనిట్ల గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు జరుగుతున్నాయని తాజా సర్వేలో తెలిసింది. అమెరికా, చైనా తర్వాత మూడవ స్థానంలో భారతదేశమే నిలిచిందని అంటున్నారు.

గత పది సంవత్సరాలలో 12 శాతం ఈ మాత్రల అమ్మకాలు పెరిగాయని  తెలుస్తోంది. ఇవి ఎక్కువగా వాడడం వల్ల ఫ్యూచర్ లో పిల్లలు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నా కానీ ఎవరు వినడం లేదని అంటున్నారు. అయితే ఈ మాత్రలను ఎక్కువగా పెళ్లయిన వారి కంటే పెళ్లి కాని వారే వాడుతున్నారని, పెళ్లి కాకముందే చాలామంది ఇల్లీగల్ గా కలిసి, గర్భం రాకుండా ఈ టాబ్లెట్స్ వాడుతున్నారని తెలుస్తోంది. కండోమ్ ద్వారా వాళ్లు సాటిస్ఫై కాకపోవడం వల్ల ఈ మాత్రలు వేసుకుంటున్నారని సర్వేలో బయటకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఎంతో సాంప్రదాయమైన భారతదేశం ఏ విధంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: