ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. అయితే వీరికి సీట్లు రాలేదు. కానీ ఓట్ శాతం మాత్రం పదిలంగానే ఉంది. చాలామంది ఓటర్లు వైసిపికి ఓట్లు వేశారు. అయితే టిడిపి కూటమిగా ఏర్పడడం వల్ల విజయం సాధించింది కానీ ఒంటరిగా పోటీ చేస్తే నైతిక విజయం వైసిపిదే అని చెప్పవచ్చు.. అలాంటి వైసిపి  ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలనను గమనించి వాళ్ళు చేస్తున్న తప్పులను వెలికి తీసి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. జనం ఇబ్బందులు పడుతున్నా వైసిపి అస్సలు పట్టించుకోవడంలేదని వారిని నిలదీస్తున్నా కానీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి జనం వైపున నిలవడంలో విఫలమవుతున్నారని చెప్పవచ్చు.. జనం పిలుస్తున్నా కానీ ఈ నాయకులు దూరంగా పరిగెడుతున్నారు.. మరి ఇలాగైతే పార్టీ రాబోవు రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు వెళుతుందో  గమనించుకోవాలి.  వైసీపీ అధినాయకత్వమేమో స్థానిక నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పట్టించుకొని నిరసన కార్యక్రమాలు చేయాలని దిశా నిర్దేశం చేస్తుంది. 

కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇది జరగడం లేదని చెప్పవచ్చు.. ఉదాహరణకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని కూర్చుంది. అయితే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వైసిపి నాయకులు కలిగే నష్టాలను వివరించి నిరసన కార్యక్రమాలు చేయాలి. కానీ అలాంటిదేమీ చేయకుండా  చాలా సైలెంట్ అవుతున్నారు. మరి వైసీపీ నాయకులు ఇలా మౌనవ్రతం పడితే పరిస్థితి ఏంటి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు పార్టీ పదవులు అందుకున్నా ఇతర ముఖ్యులు పదవుల విషయంలో చూపించిన చురుకుదనం ప్రజా సమస్యల విషయంలో చూపించడం లేదని అంటున్నారు. ఇక ఉమ్మడి విశాఖపట్నం విషయానికి వస్తే.. రెండు సీట్లు వైసిపి గెలుచుకుంది.

అందులో పాడేరు, అరకు ఉన్నాయి. పాడేరు ఎమ్మెల్యే కాస్త చురుకుగా ఉన్నా కానీ అరకు ఎమ్మెల్యే మాత్రం మొత్తానికే పట్టించుకోవడం లేదు. ఇక ఎలమంచిలిలో కూటమిలో అనేక కుమ్ములాటలు నడుస్తున్నా కానీ వాటిని బయటపెట్టి ప్రజలకు చేరువయ్యే యోచనలో వైసిపి లేకపోవడం దారుణం. అంతేకాకుండా పాయకరావుపేటలో కూటమి చాలా ఇబ్బంది పడుతోంది. బల్క్ డ్రగ్ పార్కుకి వ్యతిరేకంగా  మత్స్యకారులు ఉద్యమం చేస్తున్నా  వారికి సపోర్ట్ అందించడంలో వైసిపి విఫలమవుతోంది. ఈ సమస్యలే కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి వీటిని ఆసరాగా చేసుకొని వైసిపి నాయకత్వం ప్రజల వైపు నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలు చేస్తే రాబోవు రోజుల్లో మంచి రోజులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి ఇప్పటికైనా ఈ నాయకుల్లో కదలిక వస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.వెనక బడుతున్న వైసీపీ.. ప్రజా సమస్యలున్నా పట్టింపే లేదు.!


మరింత సమాచారం తెలుసుకోండి: