ఇప్పుడు మరోసారి రామ్ చరణ్–అలియా భట్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న వార్తలు ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యాక ఆయన సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అనేక బ్యూటీస్ పేర్లు వినిపించినా, చివరకు అలియా భట్‌నే ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. అలియా లాంటి నేషనల్ అవార్డ్ విన్నర్ నటిని మరోసారి చరణ్ సరసన తీసుకోవడం ద్వారా సినిమాపై హైప్ రెట్టింపు అవుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే, ఇది అలియాకు నిజంగానే జాక్‌పాట్ ఛాన్స్ అని చెప్పాల్సిందే. ఇప్పటికే దక్షిణాదిలో భారీ క్రేజ్ ఉన్న ఆమె, చరణ్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా తన కెరీర్‌ను మరింత హై లెవల్‌కి తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, గ్లోబల్ స్టార్‌తో రెండోసారి నటించే అదృష్టం రావడం కూడా ప్రతీ హీరోయిన్‌కి దక్కే విషయం కాదు. అందుకే అభిమానులు కూడా ఈ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో భారీగా ఎక్స్‌సైట్మెంట్ చూపిస్తున్నారు. “చరణ్–అలియా జోడీ మళ్లీ వస్తే పాన్ ఇండియా రేంజ్‌లో మరో సెన్సేషన్ కచ్చితమే” అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరీ దీని పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి