ఈ మధ్య కాలంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషులు అసలు వీళ్ళు మనుషులేనా అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు.  మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు అదే మానవత్వాన్ని చూపించడం లేదు ఎక్కడ.  ఇక ఎంతో మంది ఏకంగా కన్న బిడ్డల పాలిట శాపంగా మారి పోతున్నారు. కన్న బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి దండ్రులు యమకింకరులుగా మారి పోయి  ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.  ఇలా చిన్నచిన్న కారణాలకే ఏకంగా క్షణికావేశం లో దారుణాలకు పాల్పడుతున్నారు ఎంతో మంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.. వారి సంసారం ఎంతో సాఫీగా సాగి పోయింది . ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.  కానీ అంతలో కరోనా వైరస్ వారి కుటుంబంలో ఊహించని విషాదాన్ని నింపింది. సదరు వ్యక్తి భార్య కరోనా వైరస్ బారిన పడి మృతి చెందింది. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న సదరు వ్యక్తి ఒంటరి తనాన్ని భరించలేక పోయాడు. భార్య చెల్లెలిని పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ దీనికి అత్తా మామ మాత్రం అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన వ్యక్తి ఏకం గా నలుగురు పిల్లల ప్రాణాలు తీసాడు. ఇక తాను కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు లోకి వచ్చింది. మరదలి తో పెళ్ళికి అత్త మామలు ఒప్పుకోలేదు అన్న కారణం తో కన్నబిడ్డలను వాటర్ ట్యాంక్ లో తోసేసాడు ఇక్కడ కసాయి తండ్రి. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే నలుగురు అమ్మాయిలు కూడా మృతి చెందారు. కానీ సదరు వ్యక్తి ప్రాణాల తో బయట పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: