లోకం తీరు ఇంతేనా... ఇక మహిళలకు రక్షణ లేనట్టేనా.. నాగరిక సమాజంలో కూడా మహిళ ఇంకా భయపడుతూ బ్రతకాల్సిందేనా అన్న ప్రశ్నలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.. మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. మహిళలు రోజురోజుకుభయంతో కూడిన జీవితాన్ని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రోజురోజుకు వెలుగులోకి వస్తున్నా ఘటనలు చూస్తూ ఉంటే ఈ లోకంలో మహిళగా పుట్టడమే పాపమా అని ప్రతి మహిళ బాధ పడే దుస్థితి ప్రస్తుతం ఏర్పడుతుంది. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


 మహిళలకు రక్షణ కల్పించేందుకు  ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలను తీసుకు వచ్చాయి. కానీ చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ నేరస్తులకు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. ఎలాంటి భయం బెరుకు లేకుండా నే ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్నారు. ఇలా ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా మహిళ కామపు కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉంది. మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న ప్రతి మహిళను అడుగడుగునా వెంటాడుతున్న కామందులు బాధ పెడుతూనే ఉన్నారు అని చెప్పాలి. ఇలా రోజురోజుకు కామంతో ఊగిపోతున్న మనుషులు మానవత్వం జాలి దయ అన్నది మరిచి ఆడపిల్లలపై దారుణ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏదైనా సమస్య వస్తే అండగా ఉంటాడు అంటూ తోడు తెచ్చుకున్న స్నేహితుడే చివరికి కామాంధుడిగా మారిపోయాడు.. స్నేహితురాలికి సమస్య వస్తే రక్షణ కల్పించాల్సి ఉంది పోయి మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధుర కు చెందిన బాధితురాలు ఇటీవల ఎస్సై పరీక్ష రాసేందుకు ఆగ్రా వెళ్ళింది.తోడుగా ఫేస్బుక్లో పరిచయమైన తేజ్ వీర్ అనే స్నేహితుని తీసుకెళ్ళింది. ఎగ్జామ్ పూర్తి చేసి తిరిగి వస్తున్న క్రమంలో తేజ్ వీరు మరో వ్యక్తితో కలిసి ఇక ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువతి పోలీసులను ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: