ఇక్కడ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన భార్య ప్రియుడు భర్త ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని కామాక్షికి చెందిన సెల్వరాజ్ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సెల్వరాజ్. అయితే సెల్వరాజ్ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఇక కొన్నాళ్లపాటు భర్త కి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగిస్తూ వచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ రోజు భార్య ప్రియుడితో ఏకాంతంగా ఉండడాన్ని స్వయంగా చూసాడు భర్త. భార్యను ఆమె ప్రియుడిని నిలదీశాడు.
ఇక ఆ సమయంలో అక్కడి నుంచి సైలెంట్గా వెళ్లిపోయిన భార్య ప్రియుడు భర్తను చంపాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆటోకి నిప్పు పెట్టాడు. అనంతరం ప్రియురాలి భర్త కు ఫోన్ చేసి ఆటో కాలిపోతుంది అంటూ చెప్పాడు. దీంతో అతను నుంచి బయటకు వచ్చి చూసి ఇక జీవనోపాధి అయిన ఆటో మంటల్లో కాలిపోతూ ఉండడంతో షాకయ్యాడు. వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఇంతలో వెనుకనుంచి భార్య ప్రియుడితో పాటు మరో నలుగురు వ్యక్తులు అతని చుట్టుముట్టి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి