పెళ్లి అనేది నూరేళ్ల బంధం అందుకే పెళ్లి విషయంలో ముందు వెనక అన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది మోసగాళ్ళకు పెళ్లి అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందనే ఆశతో ఎంతోమంది ఒకటి రెండు కాదు ఏకంగా మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరికి తెలియకుండా ఒకరు ని రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. చివరికి అందరినీ మోసం చేస్తు రోడ్డున పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 మాయ మాటలతో నమ్మించి ఏకంగా నలుగురు ని పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఇంటికి పెద్ద దిక్కు లేని ఏది చేసినా అడిగేవారు ఉండని కుటుంబాల మహిళలను లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకట నరసింహా రెడ్డి అనే 44 ఏళ్ళ వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తూ ఉంటాడు. 2009లో ధన్వాడ మండలంకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ఒక పాప బాబు కూడా ఉన్నారు. అయితే మొదటి భార్యకు తెలియకుండా 2012లో అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న ఓ మహిళ ను రెండో పెళ్లి చేసుకున్నాడు.


 వీరిద్దరికీ ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే మొదటి పెళ్లి విషయం రెండో భార్య కు తెలిసింది అతనికి దూరంగా ఉంటుంది. అయితే నరసింహారెడ్డి పని కోసం హైదరాబాద్ వెళ్లే క్రమంలో అక్కడ పనిచేస్తున్న మరో మహిళను మూడో పెళ్ళి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. భర్త ఇంటికి రావడం లేదు అని ఆరా తీసిన భార్యకు నిజం తెలిసింది. దీంతో ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే నారాయణపేట మండలానికి చెందిన మరో మహిళను తనకు పెళ్ళి కాలేదని చెప్పి నాలుగొ వివాహం చేసుకున్నాడు. చివరికి ఇటీవలే మొదటి భార్య అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు  నాలుగు పెళ్లిళ్ల గురించి తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: