ఇటీవల కాలంలో క్షణకాల సుఖం కోసం మనిషి చేస్తున్న నీచమైన పనులు ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా కట్టుకున్న వారిని కాదని కడుపున పుట్టిన పిల్లలను గాలికి వదిలేసి.. ఏకంగా సుఖం కోసం పరాయ వ్యక్తుల మోజులో పడిపోయి చేయకూడని నీచమైన  పనులన్నీ చేసేస్తూ ఉన్నారు మనుషులు. ఇలా నేటి రోజుల్లో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు రోజురోజుకు ఎక్కువ అయిపోతున్నాయ్ అని చెప్పాలి.


 ముఖ్యంగా కష్ట సుఖాల్లో తోడుంటామని తుది శ్వాస వరకు చెయ్యి విడువము అని పెళ్లి సమయంలో ప్రమాణం చేసిన కట్టుకున్న వారే.. పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి సొంత వారిని  దారుణంగా హత మారుస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య చేసిన పని రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.. రాజస్థాన్ లోని ఫార్మర్ జిల్లాలో మోతిసర గ్రామానికి చెందిన సిందారి అనే వ్యక్తితో మహిళకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇక వీరి సంసారం సాఫీగానే సాగిపోయింది. కానీ కొన్నాళ్ల తర్వాత ఇక పక్కింటి వారితో ఆమెకు పరిచయాలు పెరిగాయి.


 పక్కింట్లో ఉండే జోగరన్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి చివరికి పరిచయం ప్రేమగా మారింది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు శారీరకంగా కలుస్తూ రహస్యంగా రాసలీలలు కొనసాగించేవారు. దీంతో అతనిపై ఆమెకు మరింత ప్రేమ పెరిగిపోయింది. కాగా ఇటీవల సదరు మహిళ ఇక ఆ యువకుడు కూడా కనిపించకుండా పోయారూ. కుటుంబ సభ్యులు కంగారుపడి  పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎంత వెతికినా  జాడ కనిపించలేదు. కొన్ని రోజులకు ఓ బావిలో వీరి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఇక రెండు కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: