
ఏది ఏమైనా ఇలాంటి చోరీలు మాత్రం ఇక ఇంటి బయట వాహనాలను పార్క్ చేసే బైక్ యాజమానులు అందరినీ కూడా బెంబేలెత్తిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఇలా బైక్ లో పెట్రోల్ దొంగలించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఇలాగే పెట్రోల్ దొంగలించాడు. కానీ ఇలా దొంగలించిన పెట్రోల్ తో అతను చేసిన పని మాత్రం అందరిని అvaaక్కయ్యేలా చేస్తుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది.
బాలాజీ నగర్ లోని చిమ్మన్న వీధిలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బాంబు పేలినట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన స్థానికులు బయటకు వచ్చి చూశారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే బయట నాలుగు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోతూ కనిపించాయ్. వెంటనే నీళ్లు పోసి వాటిని ఆర్పేశారు. కానీ అప్పటికే మూడు వాహనాలు పూర్తిగా కాలిపోగా.. ఇక ఒక వాహనం పాక్షికంగా దెబ్బతింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి అదే వీధిలోని ఎనిమిది ద్విచక్ర వాహనాల్లోపెట్రోల్ దొంగలించి ఆ నాలుగు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.