భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి. కానీ ఎందుకో ఇటీవల కాలంలో పెళ్లి అనే బంధంతో  దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన వారి మధ్య ఇలాంటి అనుబంధం ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలవాల్సిన భార్యాభర్తలు.. ఏకంగా ఒకరిని ఒకరు బద్ధ శత్రువులుగా భావిస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటన రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయ్.



 అంతేకాదు భార్యాభర్తలు ఏకంగా బద్ధ శత్రువుల కంటే దారుణంగా ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసేందుకు కూడా వెనకాడని పరిస్థితి నెలకొంటుంది అని చెప్పాలి. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలను చూసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆనందం ఏమో కానీ ఇలాంటి నరకం చూడాల్సి వస్తుందా అని ఎంతో మంది యువతి యువకులు పెళ్లి పేరు ఎత్తితేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి అని చెప్పాలి.


 ఏకంగా నడిరోడ్డు మీద భార్య భర్తను దారుణంగా చితక బాధిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇంత పెద్ద గొడవ జరగడానికి వెనుక ఒక చిన్న కారణం ఉంది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను పంపించిన డబ్బు లెక్క చెప్పాలని భర్త అడిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన భార్య అతన్ని తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టింది. శివ అనే వ్యక్తి బనారస్ లో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే భార్య సుశీలకు ఇటీవల 32000 పంపాడు. ఆ డబ్బులు ఏం చేశావని భర్త అడిగినందుకు.. భార్యకు కోపం వచ్చింది. ఇక తన చెల్లితో కలిసి భర్తను కట్టేసి దారుణంగా కొట్టింది. దీంతో బాధితుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: