పాలబుక్కల పసివాళ్ళు కాటికి కాలు చాపిన ముసలి వాళ్లు ఎవరైతే మాకెందుకు.. మా కోరిక తీరిందా లేదా అన్నట్లుగా మృగాల్లా మారిపోతున్న మగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం ఒంటరిగా ఉన్న మహిళలకు మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదురయ్యేవి అని అందరు అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో పక్కన కుటుంబ సభ్యులు ఉన్న కామాంధులు వెనకడుగు వేయడం లేదు.


 ఏకంగా వారిపై దారుణంగా దాడి చేసి మరి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు రోజురోజుకు  వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. నగరాల నుంచి పల్లెటూర్ల వరకు కూడా ప్రతి చోట ఇలాంటి అఘాయిత్యాలు  జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవలే ఉత్తరప్రదేశ్లో అయితే మరింత దారుణమైన ఘటన జరిగింది అని చెప్పాలి. ఏకంగా మానసిక వికలాంగురాలు అయిన బాలికపై ఒక కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన బులంద్ షహర్ జిల్లా కుర్జానగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. మానసిక వికలాంగురాలు అయినా తన సోదరిపై 30 ఏళ్ల కనహయ్య అనే వ్యక్తి అత్యాచార చేశాడని బాలిక సోదరుడు ఫిర్యాదు చేశాడు.


 దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బాలిక ఆడుకోవడానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటాము అంటూ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది. అయితే ఆభం శుభం తెలియని మానసిక వికలాంగురాలు పై అఘైత్యానికి పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: