ఉక్రెయిన్ ఇప్పటివరకు డిఫెన్స్ తరహా యుద్ధ పోకడను అనుసరించింది. అయితే ఇప్పుడు అది తన విధానాన్ని మార్చుకొని అఫెన్స్ తరహా యుద్ధాన్ని మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. రష్యా కు సంబంధించిన మూడు ప్రాంతాలపై దాడులు చేసి అక్కడ సైన్యాన్ని పరుగులు పట్టించింది. జనాలను కూడా పరుగులు పెట్టించింది వరసగా డ్రోన్ల సహాయంతో మిసైల్స్ తో దాడి చేసింది.


అయితే కొన్ని డ్రోన్లను మేము తిప్పి కొట్టామని, ధ్వంసం చేసామని చెప్తుంది అక్కడ రక్షణ సైన్యం. క్రిమియా మీద కూడా దాడి చేస్తే మేము కొన్ని మిసైల్స్ ధ్వంసం చేశామని కూడా చెప్పింది రష్యా. అయితే ఇక్కడ ఉక్రెయిన్ కు ఒక చేదు అనుభవం ఎదురయిందని తెలుస్తుంది. ఉక్రెయిన్ కి సంబంధించిన బాగ్పుత్ కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సారిడార్ అనే ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతం  70 నుండి 80% వరకు రష్యా చేతిలో లో ఉన్నట్లుగా తెలుస్తుంది.


ఆ ప్రాంతం మీద దాడి చేసి అప్పటికే 1600 మందిని చంపి మరీ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది రష్యా. అయితే దీనికి మండిపడిన ఉక్రెయిన్ ఒక్క రోజులోనే సారిడార్ లో ఉన్న రష్యా సైన్యం మీద 26 సార్లు దాడి చేసింది అని తెలుస్తుంది. 26 వైపుల నుంచి దాడి చేసిందని తెలుస్తుంది. అయితే రష్యా దీనిని సమర్థవంతంగా ప్రతిఘటించింది. రష్యా ఉక్రెయిన్ పంపిన మిసైల్స్ ను ధ్వంసం చేసింది. డ్రోన్లను లను కూడా ధ్వంసం చేసింది. ఉక్రెయిన్ యొక్క ఆర్టిలరీని కూడా ధ్వంసం చేసింది అన్నట్లుగా తెలుస్తుంది.


దీంతో ఎక్కడి నుంచి ఉక్రెయిన్ దాడి చేస్తుందో అక్కడి ప్రాంతం పై టార్గెట్ చేస్తూ ఎయిర్ ఫోర్స్ ద్వారా దాడి చేసింది రష్యా. రష్యా చేస్తున్న ఈ దాడి దెబ్బకి ఉక్రెయిన్ బిత్తరపోయిందని తెలుస్తుంది. సరిగ్గా రష్యా ఉక్రెయిన్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు దానికి తెలుస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: