దేశంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చు.  లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఈ ఎన్నికలను అటు ఎన్డీయే కూటమి, ఇటు ఇండియా కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి అనడంలో సందేహం లేదు.  ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి.
            

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు తమ  బలాబలాలను అంచనా వేసేందుకు ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించాయి. దీంతో పాటు పలు సంస్థలు కూడా సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఇందులో నెలవారీ లెక్కలు తీస్తున్న పోల్  స్ట్రాటజీ గ్రూపు ఆగస్టు 23 నాటికి ఏపీ పరిస్థితులపై తమ సర్వేను బహిర్గతం చేసింది.  ప్రస్తుతం టీడీపీ జనసేనలు కలిసే పోటీ చేస్తాయ్ అని ప్రకటించిన తర్వాత ఫలితాలు వచ్చే నెలలో తెలియనుంది. సామాన్యంగా వీరు నియోజకవర్గాల సంఖ్య ఇవ్వరు. ఎంతమంది పై సర్వే నిర్వహించారు అనే మాత్రమే చెప్తారు.


తాజాగా ఏపీ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో వైసీపీకి 50శాతం ఓట్లు, టీడీపీ జనసేనకు కలిపి 42 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక సీఎంగా ఎవరు ఉండాలనే  విషయానికొస్తే జగన్ కు మద్దతుగా 55 శాతం, చంద్రబాబు ఉండాలని 34 శాతం, పవన్ కల్యాణ్ సీఎం కావాలని 11 శాతం మంది కోరుకుంటున్నారు.


ఏపీ 2023లో జగన్ పాలన అస్సలు బాగాలేదు అని 9 శాతం మంది, బాగాలేదు అని 25 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత 34 శాతం.  చాలా బాగుంది అని 11 శాతం, బాగుంది అని 55 శాతం అంటే వైసీపీ కి అనుకూలంగా 66 శాతం మంది ఉన్నారు.  ఇది ఎంత వరకు కచ్చితమనేది రాబోయే ఎన్నికల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: