ఈమధ్య చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విషయంలో అరెస్టు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే విషయంపై  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి  మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై మీ ఉద్దేశం ఏమిటని అడిగితే  రేవంత్ రెడ్డి దాన్ని అరెస్టు గానే చూస్తున్నాం అని సమాధానం ఇచ్చారట. చంద్రబాబు నాయుడు విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకూడదు అని  రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని తెలుస్తుంది.


ఇప్పుడైతే  వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి ఇలా ఉంది కానీ గతంలో రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ కమిటీ చైర్మన్. అయితే ఓటుకు నోటు కేసులో కొంతకాలం జైలుకి వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డికి. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన మాటల ద్వారా ఆయనను అరెస్టు చేయడానికి  అప్పుడు అంత సిద్ధం చేశారట. అయితే రామోజీరావు లాంటి వ్యక్తుల సహాయంతో చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో మాట్లాడి కేసు  లేకుండా చేయించుకున్నారట.


ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తెలంగాణలోనే వదిలేసి చంద్రబాబు నాయుడు ఆంధ్ర వైపుకు వచ్చారు. అయితే ఆ తర్వాత 2018లో తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని తిరిగి బలపరచాలని  అనుకున్నారట చంద్రబాబు నాయుడు. దాంతో  కేసీఆర్ తిరిగి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారట. దానిలో భాగంగానే రాబోయే ఎలక్షన్లలో కూడా తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటారేమో అని అనుకున్నారట కేసీఆర్.


దాంతో ముందు జాగ్రత్తగా కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించారని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో  జగన్ గెలవడానికి కేసీఆర్ డబ్బులు ఇచ్చారని, బిఆర్ఎస్, బిజెపి, వైసిపి ఒకటే అన్నారు మధు యాష్కీ. మొన్నటి వరకు రేవంత్ రెడ్డిని ద్వేషించిన మధు యాష్కీ ఎల్బీనగర్ సీటు అవసరం అవడంతో తిరిగి ఆయనతో స్నేహంగా ఉంటున్నారట. ఆయిన అనట్లుగానే చంద్రబాబు అరెస్టు వెనకాల వీళ్ళ హస్తం ఉందని అంటున్నారట చాలామంది .

మరింత సమాచారం తెలుసుకోండి: