ఎల్లో మీడియాలో రాస్తున్న విచిత్రమైన అంశం ఏమిటంటే ఎఫ్ఐఆర్ లో పేరు లేదు కాబట్టి చంద్రబాబు అరెస్టు చేయడం అక్రమం అని. ఉదాహరణకు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మన మీద దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఆ తర్వాత వారు విచారణ జరిపి దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దాడి చేసిన వ్యక్తి ఎఫ్ఐఆర్లో మొదట నా పేరు లేదు నా కేసు కొట్టేయండి అంటే చెల్లుబాటు అవుతుందా.
స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాలు కనిపిస్తుండగా కుంభకోణం ఎలా అవుతుంది అని ఎల్లో మీడియాలో రాస్తున్నారు. మరి జగన్ కేసులో భారతి సిమెంట్, సాక్షి లు ఉన్నాయి. వాటిలో బోగస్ పెట్టుబడులు పెట్టారనే జగన్ పై కేసు నమోదు చేశారు. మరి ఇవి కూడా కనిపిస్తున్నాయి అని అధికార పక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ గతంలో బోఫార్స్ తుపాకులు రూ.10 అయితే రూ.100 కి కొన్నారు అని ఆరోపించి.. అవి అంతకుముందే వాడిన తుపాకులు అని ప్రచారం చేసింది. 1984లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఇది ఒక కారణం. అప్పుడు జరిగిన కార్గిల్ యుద్ధం లో బోఫార్స్ తుపాకులనే వాడారు. ఇవి విజయవంతంగా పనిచేశాయి కాబట్టి ఈ కుంభ కోణం జరగలేదు అని అందామా అంటున్నారు కొందరు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి