భారత్ సరిహద్దుల్లో ఏదో చేస్తుంది కేంద్రం. అక్కడ ఏమి జరుగుతుందో గానీ అంతా సైలెంట్ గా జరుగుతూ వస్తుంది. భారత్ అక్కడ ఒక యుద్ధ వాతావరణానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది అని తెలుస్తుంది‌ ఇప్పుడు. మరి భారత్ ను ఎవరు యుద్ధానికి పురి గొల్పుతున్నారో, మరి ఎవరి పైకి భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందో అనేది అధికారికంగా తెలియడం లేదు. ఒక పక్క పాకిస్తాన్ ఆక్యుఫైడ్ కాశ్మీర్ ద్వారా భారత్ లోకి చొచ్చుకుని వస్తుంది పాకిస్తాన్.


ఆ విధంగా అది భారత దేశంలోకి వచ్చి భారత సైన్యం పై దాడులు చేస్తుంది. పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ప్రజల దృష్టి ప్రభుత్వం యొక్క అసమర్ధత పైకి వెళ్తుంది. కాబట్టి దానిని మళ్లించడానికి పాకిస్తాన్ యుద్ధం అనే  సాకును చూపిస్తుంది. పాకిస్తాన్ పని ఇలా ఉంటే మరోపక్క చైనా కూడా పాకిస్తాన్లోనే తయారయింది. చైనాలో కూడా ఆర్థిక సంక్షోభం పెరుగుతుందని తెలుస్తుంది. మరో పక్కన చైనా రక్షణ మంత్రి కనపడకుండా పోయాడు.


అంతేకాకుండా చైనా విదేశాంగ మంత్రిని కూడా అకస్మాత్తుగా మార్చి వేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ సైనిక మార్షల్ కూడా కనిపించకుండా పోతున్నారట. అయితే చైనాలో జరుగుతున్న వీటన్నిటికీ కారణం ఆ దేశంలోని అంతర్గత కలహాలేనని అంటున్నారు. దాంతో చైనా కూడా తమ ప్రజల దృష్టిని అంతర్గత వ్యవహారాల నుండి బయటికి తీసుకురావాలని భావిస్తుందట. దానికి చైనాకు దొరికిన ఒకే ఒక దారి భారత్ తో యుద్ధం.


అప్పుడు చైనాలోని ప్రజలు ఈ విషయాల గురించి చైనా అంతర్గత వ్యవహారాల గురించి ఆలోచించడం మానేసి యుద్ధం పైనే కాన్సన్ట్రేషన్ చేస్తారని వీళ్ళ భావన. అయితే  పొరుగు దేశాల కుట్రపూరిత ఆలోచనలను ముందుగానే పసిగడుతూ ఉంటుంది భారత్. కాబట్టి వాటి కుట్రలకు అనుగుణంగానే భారత్ తన అత్యంత శక్తివంతమైన ప్రళయ్ మిస్సైల్స్ ను బయటికి తీసింది. భారత ఉపఖండంలోని ఎటువంటి లక్ష్యాన్నైనా ఛేదించగలవు ఈ మిసైల్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: