ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటిలో ముగిసేలా లేదు.  అతిపెద్ద అణు క్షిపణిలు కలిగిన రష్యా లాంటి దేశంపై ఉక్రెయిన్ ఇంకా పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్ కు బయటి నుంచి నాటో దేశాల సహకారం లభిస్తోంది.  రష్యా సైన్యంపై ఉక్రెయిన్ దళాలు బాగానే పోరాడుతున్న కొన్ని చోట్ల రష్యాకు ఉక్రెయిన్ సైన్యం లొంగిపోయినట్లు తెలుస్తోంది.


బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో పాక్ సైన్యం సుమారు 90 వేల మంది ఆయుధాలు వదిలి లొంగిపోయారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు.  అంతమంది సైన్యాన్ని విడిచిపెట్టిన చరిత్ర కూడా మనదే. ఆ సమయంలో ౩వేల మంది భారత సైనికులను పాక్ వాళ్లు పట్టుకున్నారు.  కానీ వాళ్లను విడిపించుకోవడానికి భారత్ కు కొన్నేళ్లు పట్టింది.


ఆ తర్వాత మళ్లీ అంతపెద్ద లొంగుబాటు జరగలేదు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇందులో ఉక్రెయిన్ సైన్యం వీడియో సాక్ష్యంగా సుమారు 10 వేల మంది రష్యాకు లొంగిపోయారు. ఆయుధాలు, బాంబులు వదిలి డ్రోన్ల ఎదురుగా లొంగిపోతున్నట్లు 10 వేల మంది ప్రకటించారు.  ఇది రెండో అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెప్పవచ్చు.


దీనికి ప్రధాన కారణం సరైన ఆహారం లేదు. ఓ  పక్క యుద్ధం చేస్తూ మరో పక్క పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  దీంతో పాటు ఆరోగ్య, కుటుంబ సమస్యలు వీరిని వెంటాడుతున్నాయి. ఉన్న ఆయుధాలు సరిగా లేవు.  వాటితోనే యుద్ధం కొనసాగించమని పై అధికారులు చెబుతున్నారు. ఓ పక్క రష్యా మాత్రం డ్రోన్లు, మిస్సైల్ లు వాడుతూ ఉక్రెయిన్ సైనికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు వీరికి సహకారం అందిస్తున్న అమెరికా, యూరప్ నుంచి సరఫరా అయ్యే ఆయుధాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. అంతేకాక ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది.  దీంతో తప్పని పరిస్థితుల్లో 10 వేల మంది లొంగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: