ప్రస్తుతం ఏపీలో జరుగుతుంది అదే. ఏపీలో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకూడదని వైసీపీ ఆది నుంచి భావించింది. దమ్ముంటే సింగిల్ గా రావాలని.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అని రకరకాల ప్రకటనలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ పవన్, చంద్రబాబులు ఇవేమీ పట్టించుకోకుండా తమ పొత్తును ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టో, కలసి సమన్వయ సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కానీ వైసీపీ మాత్రం జనసేన, టీడీపీ మధ్య దూరం పెరిగింది అని.. కలిసి పనిచేయడం లేదు అని... పవన్ కల్యాణ్ అలిగారు అని రకరకాల ప్రచారం చేస్తోంది. వాస్తవాలు ఏదైనా రాజకీయాల్లో ఆరోపణలు సహజం. ఏ విధంగా అయినా ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించాలని చూస్తాయి. అందులో భాగంగానే వీటిని చూడొచ్చు.
ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం చెడిపోవాలని వైసీపీ భావిస్తోంది. కాపు, కమ్మ సామాజిక వర్గ ఓట్లు కలిస్తే అది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే. వాస్తవానికి ఈ రెండు పార్టీల నాయకులు కలిసి పనిచేస్తున్నారని క్షేత్ర స్థాయి సర్వేల్లో వెల్లడవుతుంది. దాదాపు 90శాతం మేర ఓటు బదిలీ జరుగుతుందనే తెలుస్తోంది. ఇది టీడీపీ, జనసేన పార్టీలకు అతి పెద్ద సానుకూలాంశం. ఇదితమ విజయావకాశాలపై ప్రభావం చూపుతోందని భావించిన వైసీపీ అధిష్ఠానం ఏ విధంగా అయినా క్యాడర్ లో గందరగోళం సృష్టించాలని చూస్తోంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించాలనే ప్రయత్నం చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి