ఏపీలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. కరెక్టుగా ఈ సమయంలోనే ప్రధాని మోదీ రాష్ట్రంలో పలు చోట్ల పర్యటిస్తున్నారు. కూటమిలో జోష్ నింపేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రధాని పర్యటనకు చంద్రబాబు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. అసలు చంద్రబాబు ఎందుకు రావడం లేదు. కారణమేంటి అనే చర్చకు దారి తీస్తోంది.  రాజమండ్రి సభకు హాజరైన మోదీ పురంధేశ్వరీని ఆశీర్వదించాలని కోరారు.


అయితే ఇక్కడ మోదీతో పాటు నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వేదిక పంచుకున్నారు. రాజమండ్రి సభ అనంతరం ప్రధాని అనకాపల్లి వెళ్లారు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ పోటీ చేస్తున్నారు. చంద్రబాబు రాజమండ్రి సభకు హాజరు కాకుండా.. అనకాపల్లిలో మాత్రం హాజరయ్యారు. దీని వెనుక పరిణామాలు ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.


కూటమిలో ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా అని పలువురు చర్చించుకోవడం మొదలు పెట్టారు. పైగా మోదీ కూడా ఇండియా కూటమిని విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. జగన్ ని పల్లెత్తి మాట అనడం లేదు. మరోవైపు ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అని చెప్పి ఉమ్మడి మ్యానిఫెస్టో గురించి ప్రస్తావించడం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ లు కూడా ఇండియా కూటమి నేతలను కానీ.. కాంగ్రెస్ ను కానీ విమర్శించడం లేదు. వారంతా జగన్ నే టార్గెట్ చేసుకున్నారు. మోదీ ఏమో ఇండియా కూటమి నేతల్ని తిడుతున్నారు.


మొత్తం మీద ఎవరి ఎజెండా వారిది అన్నట్లు కూటమి ప్రచారం సాగుతోంది. అనకాపల్లి సభలో ప్రధాని మాట్లాడటం అయిపోయి వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. రాజమండ్రిలో ప్రధాని సమక్షంలో నారా లోకేశ్ మాట్లాడారు. ఓవరాల్ గా చూసుకుంటే చంద్రబాబు సమక్షంలో మోదీ మాట్లాడారు తప్ప.. మోదీ సమక్షంలో చంద్రబాబు ప్రసగించలేదు. ఇదే ఈ సారి పొత్తుల్లో స్పెషల్. మరి ఎందుకు జరిగిందో వ్యూహాత్మకా.. లేక మరేదైనా అనేది వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: