ఏపీ సీఎం జగన్‌ ది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి వైఎస్‌ ఉమ్మడి ఏపీలో రెండు సార్లు సీఎంగా చేశారు. సీఎంగా ఉన్నప్పుడే హఠాన్మరణం చెందారు. ఇక జగన్ తల్లి విజయమ్మ.. జగన్ పెట్టిన పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల గతంలో అన్న పార్టీకి అండగా నిలిచారు. అన్న జైల్లో ఉన్నప్పుడు స్వయంగా పాదయాత్ర చేసి అన్న పార్టీని జనంలోకి తీసుకెళ్లారు. ఇటీవల షర్మిల సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అంటూ సొంత పార్టీ పెట్టుకుని తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


అయితే.. జగన్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అన్న జగన్‌తో సరిగ్గా పడనందుకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారని ప్రచారం ఉంది. ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే.. ఈ విషయాల గురించి చిలువలు పలువలుగా వార్తలు, ఊహాగానాలు రాశాయి. అయితే.. ఇప్పుడు స్వయంగా టీడీపీ అధినేత జగన్  ఫ్యామిలీ గురించి పబ్లిక్‌గా విమర్శలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.


జగన్ తల్లి విజయలక్ష్మీ కోపంగా ఉన్న  మాట వాస్తవం కాదా..? అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అలాగే చెల్లి షర్మిళ మాట వినడం లేదని వైసీపీనే చెప్పింది కదా..? అంటూ మాట్లాడారు. షర్మిళ తెలంగాణలో పార్టీ పెట్టడం నిజం కాదా..? ఏమైనా చెప్పాలనుకుంటే సమాధానం చెప్పాలి కానీ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. అసలు చంద్రబాబు ఎందుకు ఇలా అన్నారంటే.. సీఎం జగన్ పై పోస్టులు పెట్టినందుకు టీడీపీ కార్యకర్తపై కేసు పెట్టారట.


ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు.. ఒక్కరిని కొడితే పది మంది తిరిగి కొడతారు.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. రక్షణ కల్పించాల్సిందిగా అయ్యన్న కోర్టుకెళ్లారని.. ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటానని రక్షణ కల్పించాలని ఎంపీ రఘు రామకృష్ణం రాజు కోర్టుని ఆశ్రయించారని.. ఇలా స్వయంగా నేతలకే రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: