వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో సారి సీఎం కావడం ఖాయమని.. ఆ తర్వాత చంద్రబాబుకు పిచ్చిపట్టడం ఖాయం అని మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. జగన్ ను సీఎంగా ఉండేలా కార్యకర్తలు కాపాడుకోవాలని పిలుపు ఇస్తున్నారు. జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్న కొడాలి నాని.. చంద్రబాబు హయాంలో విద్యారంగంలో 3-4 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదంటున్నారు. విద్యారంగంపై సీఎం జగన్ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని కొడాలి నాని గుర్తు చేశారు.
అంతే కాదు.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా, పెట్టని అంశాలనూ సీఎం అమలు చేస్తున్నారని కొడాలి నాని అంటున్నారు. మేని ఫెస్టోలో చెప్పకపోయినా నాడు నేడు ,ఇంగ్లీష్ మీడియం, ల్యాప్ టాప్ లు ,అమలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. విద్యారంగంపై 60 వేల కోట్ల రూపాయలకు పైగా సీఎం జగన్ ఖర్చుపెడుతున్నారని కొడాలి నాని గుర్తు చేశారు. అంతే కాదు.. పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు తన మనువడు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. తెలుగును కాపాడాల్సిన బాధ్యత నిరుపేదలల పిల్లపైనే ఉందా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ ను ఓడించి.. పాతాళంలో పూడ్చాలని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రూ.2250 పింఛన్‌గా కొంతకాలం ఇచ్చారని.. తరువాత రూ.2500 ఇస్తున్నారని గుర్తు చేశారు. వచ్చే జనవరి నుంచి రూ.2750 ఫించన్ ఇస్తారని.. ఆ తరువాత సంవత్సరం రూ.3000 ఇస్తారని.. కొడాలి నాని అన్నారు. సీఎం వైయస్ జగన్ 62 లక్షల మంది నిరుపేదలకు లక్ష కోట్ల రూపాయలు ఇస్తున్నా.. పచ్చమీడియాను నడిపే పనికిమాలిన వాళ్లు ప్రజల నుంచి సీఎం వైయస్ జగన్‌ను దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.