చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్ నెట్ వంటి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఇటీవల ఈడీ కూడా కొందరికి నోటీసులు పంపింది. అంతే కాదు.. ఈ కేసుల్లో చంద్రబాబు, జగన్.. జైలుకు పోవడం ఖాయమని జోగి రమేశ్ వంటి మంత్రులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై నారా లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి అంటూ తనపై ఆరోపణలు చేసిన వారు వెంటనే నిరూపించాలని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు.


తనపై ఆరోపణలు నిరూపించమని 24గంటలు ఇచ్చిన సమయం దాటిపోయిందని... మాట్లాడిన వారు  ఎక్కడ దాక్కున్నారని నారా లోకేశ్‌  అన్నారు. 7అంశాల్లో తనపై మూడు న్నర ఏళ్లుగా  ఆరోపణలు చేస్తూ ఒక్కటీ నిరూపించలేదని నారా లోకేశ్‌ అన్నారు. కావాలంటే మరో 24గంటలు సమయం ఇస్తానని,తపై  చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని నారా లోకేశ్‌ సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డిలా తాను పారిపోయే రకం కాదన్న లోకేష్... ప్యాలెస్ పిల్లుల్లా దాక్కోకుండా, ధైర్యం ఉంటే బయటకు వచ్చి నా సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.


తనపై  తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని లోకేశ్‌ హెచ్చరించారు. జయహో బీసీ సభ పేరును టీడీపీ నుంచి కాపీ కొట్టారన్న లోకేశ్.. బీసీలకు టీడీపీ ప్రభుత్వం చేసిన దాంతో పోల్చితే గోరంత కూడా వైసీపీ ఖర్చు చేయలేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు జగన్మోహన్ రెడ్డి కోత పెట్టలేదా? అని నారా లోకేశ్‌ ప్రశ్నించారు.జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నలుగురు రెడ్లకు బీసీలంటే నరనరాల్లో కోపమని నారా లోకేశ్‌  అన్నారు. 24మంది బీసీలను హత్య చేయించటమే జయహో బీసీ నినాదమా?అని నారా లోకేశ్‌  వ్యాఖ్యానించారు.


అవినీతి ఆరోపణల విషయంలో జగన్‌ సర్కారుకు నారా లోకేశ్‌  వేసిన సూటి ప్రశ్నకు సమాధానం లభించాల్సింది. జగన్‌ సీఎం అయి దాదాపు 4 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు, లోకేశ్ అవినీతి ఉంటే.. ఈ పాటికే చర్యలు తీసుకోవాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: