ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.5000కోట్ల భారీ కుంభకోణానికి ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన షిరీడీ సాయి ఎలక్ట్రికల్స్ కు అధిక ధరలకు ఈ మీటర్లు కట్టపెడుతోందని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆరోపించారు. జగన్ సర్కార్‌ ఏ మాత్రం భయం లేకుండా చేసే బరితెరిగింపు దోపిడీ ఇదంటూ టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి  మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో రూ.800కు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తే, ఏపీలో రూ.12వేలకు టెండర్లు పిలిచారని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి  ఆరోపించారు.

 
టెండర్ అర్హతలు కూడా షిరిడీ సాయికి అనుకూలంగా రూపొందించారని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. మీటర్ల ఏర్పాటుతో పాటు తర్వాత మెయిన్‌ టెన్స్ రూపేణా కూడా అవినీతి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి  ఆరోపించారు. కొత్త అప్పు కోసం స్మార్ట్ మీటర్ల నిబంధనలకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆయన మండిపడ్డారు.


మీటర్ల ఏర్పాటే రైతులకు ఉరితాళ్లనుకుంటే ఇప్పుడు వాటి ఏర్పాటులోనూ అవినీతికి పాల్పడటం దుర్మార్గమన్న టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ... డిస్కమ్ లు, విద్యుత్ పంపిణీ వ్యవస్థల్ని కుప్పకూల్చటంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర ప్రభుత్వ చర్యల్లో ఉందన్నారు. అయితే ఈ కుట్ర ముందుగానే బయటపడటంతో ఆగిపోయిందని లేకుంటే రాష్ట్ర ఖజనాకా రూ. 5000 కోట్ల నష్టం జరిగేదని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చెప్పుకొచ్చారు.


సరే.. ఈ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. ముందుగా ఈ స్కామ్‌ వ్యవహారం గురించి ఎల్లో మీడియాగా పేరున్న ఓ ప్రముఖ పత్రికలో కథనం వచ్చింది. ఆ తర్వాత.. దీని గురించి టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించారు. ఇలా ఆ పత్రికలో కథనాలు రావడం.. టీడీపీ నేతలు విమర్శించడం..మళ్లీ టీడీపీ నేతల విమర్శలను అదే పత్రిక ప్రముఖంగా ప్రచురించడం అంతా వైసీపీ సర్కారుపై కావాలనే బురద జల్లే వ్యవహారం అని వైసీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: