
సౌత్ అమెరికా ఇంకా తూర్పు యూరప్ దేశాలు భారతదేశం నుంచి ఆధ్యాత్మిక ఆదేశాలు పొందుతాయని, జర్మనీ, ఫ్రాన్స్ఇంకా ఇటలీ బ్రతికి బట్ట కట్టినా యూరోపియన్ యూనియన్ పై వాళ్ళ కంట్రోల్ ని కోల్పోతారని వాళ్లు చెప్పారు. ఈయూ ఇంకా నాటో రెండూ విడిపోతాయని.. చైనా 2030 కల్లా కొన్ని దేశాలపై యుద్ధాన్ని ప్రకటిస్తుందని , ఈ దశాబ్దంలో మిడిల్ ఈస్ట్ ఇజ్రాయిల్ పై పలుసార్లు దాడి చేస్తుందని ఆ యుద్ధం సంక్షోభాన్ని పెంచేస్తుందని వారు చెప్పారు.
ఇండియా తన మిత్ర దేశాలైన రెండు దేశాలతో జరిగే యుద్ధంలో ఉత్తర సరిహద్దు కొంతవరకు నష్టపోతుందని, పి ఓ కే ఇంకా గిల్గిస్తాన్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయని, టిబెట్ వల్ల భారత్ ఒక ఆధ్యాత్మిక గురువుగా మరింత ఉన్నతిని సాధిస్తుందని.. ఇంకా భారతదేశపు డిజిటల్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సిస్టం ని ప్రపంచమంతా అనుసరిస్తుందని వారు చెప్పారు. సంక్షేమ పథకాలతో కూడిన నైతిక పెట్టుబడిదారీ విధానం కొత్త పుంతలు తొక్కి పేద ప్రజలకు కొత్త పరిపాలన విధానాన్ని తెస్తుందని, జపాన్ ఇంకా సింగపూర్ లు భారత్ తో భాగస్వామ్యం ను కలిగి ఉంటాయని, పాకిస్తాన్, ఖతార్, మలేషియా వంటి దేశాలు ఒంటరిగా మిగిలిపోతాయని, రూమ్ టెంపరేచర్ క్వాంటం కంప్యూటర్స్ అందుబాటులోకి వస్తాయని కూడా ఈ జ్యోతిష్యులు చెబుతున్నారు.