ఒకప్పుడు బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇప్పుడు మళ్లీ ఆచరణలోకి వచ్చేటట్టే కనిపిస్తుంది. కులం మెజారిటీదైతేనో, మతం మెజారిటీదైతేనో మాత్రమే ఇక్కడ బతకగలం అనే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. కులాల వారీగా హిందువుల విభజన కోసం ఎత్తుగడ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మామూలుగా అయితే పాకిస్తాన్ ఇంకా ఆఫ్గనిస్తాన్ లో మతాల పరంగా విభజన జరుగుతుంది. కానీ ఇక్కడ కుల గణనలు పెరుగు తున్నాయి.


రాష్ట్ర వ్యాప్తంగా అయితే కుల గణనలు ఉంటాయి, కానీ దేశ వ్యాప్తంగా అయితే అవి ఒక్కో రాష్ట్రాన్ని బట్టి , జనాభా ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. ఆంధ్రాలోని బీసీ కులాలు.. తెలంగాణలో బీసీలు కాదు. మహారాష్ట్రలోని ఎస్సీలు, తెలంగాణలో  బీసీలుగా పరిగణనలోకి వస్తారు. కానీ ఇప్పుడు ఇలా దేశవ్యాప్తంగా కులాల పేరుతో  విభజించి పాలించు అనే అంశాన్ని ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది చెప్పుకోవాలంటే మండల కమిషన్ సిఫారసు లను తీసుకువచ్చి దేశాన్ని కులాల పేరుతో విభజించాలనుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అయోధ్య అంశాన్ని  తీసుకువచ్చి క్యాస్ట్ పోలరైజేషన్ చేసింది.


ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద కోపంతో కులాల వారీగా ప్రజలను రెచ్చగొట్టడానికి మోడీని దెబ్బతీయడానికి నితీష్ కుమార్ పూనుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. బీసీ పేరుతో నితీష్ కుమార్ బీహార్ నుండి దేశవ్యాప్తంగా ప్రజలను కులాల పేరుతో విడగొట్టడానికి, తద్వారా రాజకీయ లబ్ధిని పొందడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో బీహార్ నుండి లాలూ ప్రసాద్ యాదవ్ , తర్వాత నితీష్ కుమార్ సుదీర్ఘకాలం పాటు బీహార్ కు మంత్రులుగా పనిచేసినా, వాళ్ళు బీహార్ కి  ఏం చేశారనే విషయం మాత్రం అస్పష్టం.


బీహార్ నుండి పక్క రాష్ట్రానికి వెళ్లిన వాళ్ళు ఇప్పటికి ఆయా రాష్ట్రాల్లో కూలీలుగానే పని చేస్తున్నారు. ఇక వీళ్ళు బీహార్ ప్రాంత వాసులను అభివృద్ధిపరిచింది ఏముంది! మొత్తానికి ప్రజలను కులాల పేరుతో, వాళ్లలో వాళ్లకి కలహాలు సృష్టించి విభజించి తద్వారా హిందువులను సంయుక్తంగా ఉండనీయకుండా చేసే కుట్రలా ఇది తయారవుతుందని తెలుస్తుంది‌.

మరింత సమాచారం తెలుసుకోండి: