
దీనిపై ప్రజల అభిప్రాయాన్ని ఇండియా టుడే సర్వే ద్వారా చేపట్టింది. దాని ప్రకారం కాంగ్రెసుపై ప్రజల ఫోకస్ పెరిగింది అన్నమాట 37%, రాహుల్ బ్రాండింగ్ పెరిగింది అన్నది 13 శాతం, అలాగే కాంగ్రెస్కు కలిసి వస్తుంది అన్నది 29 శాతం, ఏమాత్రం మార్పు లేదు అన్నది తొమ్మిది శాతం మంది. అని సర్వేలో తేలింది. అలాగే భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్లో కొంచెం మార్పు వచ్చిందని చెప్పవచ్చు.
బీజేపీకి ప్రధాని మోడీ తర్వాత అంతటి నాయకుడు ఎవరంటే అమిత్ షా తర్వాత యోగి ఆదిత్యనాథ్ గడ్కరీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్లో కూడా రాహుల్ గాంధీ అనంతరం సచిన్ పైలెట్ గాంధీ ల పేరు ఎక్కువగా వినిపిస్తుంది. భారత్ జోడో యాత్ర అనేది కాంగ్రెస్లో ఒక మార్పును మాత్రం కచ్చితంగా తెచ్చిందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా రాహుల్ కు ఉన్న ఇమేజ్ 15%, 18%, 23% నుండి ఏకంగా 26% వరకు ఈ యాత్ర అనంతరం ఇమేజ్ పెరిగింది.
రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటున్న వారు 26% వరకు పెరిగింది. అనంతరం సచిన్ పైలెట్ కు 12 నుంచి 13 శాతం అలాగే కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాలనుకుంటున్న వారికి 24% శాతం ఉంది. మమతా బెనర్జీ కి కొంచెం తగ్గింది. మొత్తం మీద భారత్ జూడో యాత్ర రాహుల్ గాంధీకి మేలు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు ప్రజల్లో ఎక్కువ ఆదరణ లేకున్నా జోడోయాత్రతో రాహుల్ కు అది తీరిపోయింది.