
ఇదే సమయంలో ఆర్యవైశ్య సమితి వారు కూడా ఇంకా ధర్నా నిర్వహించనున్నారని మరో పత్రికలోనూ ఒక కథనం వచ్చింది. అయితే ఇందులో స్పష్టత కరువైంది. అది సబ్ ఎడిటర్ల లోపమా లేక కథనం రాయడంలో ఏర్పడిన లోపమో కానీ ఆ వార్తలో స్పష్టత కరువైంది. కానీ ఏదేమైనా తెలంగాణలో గుజరాతీలు, మార్వాడీలు వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. ఈ వ్యాపారాలలో ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి వచ్చే కూలీలకు వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఎందుకంటే అక్కడివారు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎక్కువగా పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అక్కడి వారైతే కచ్చితంగా ఎక్కువగా పని చేయాలని వారి ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి వారి ప్రాంతీయ తను బట్టి వారు వారి స్వగ్రామాల నుంచి వారి సొంత రాష్ట్రాల నుంచి ఇక్కడికి యువతను రప్పించుకొని వారికి పని ఇస్తారు. దీనివల్ల ఇక్కడ యువతకు పని లేకుండా పోతుందని మాదిగ పరిరక్షణ సమితి ధర్నా చేపడుతోంది.
ఇందులో కొంతవరకు వాస్తవం ఉన్న తెలంగాణ నుంచి నార్త్ ఇండియాకు వెళ్లి పని చేసేవారు ఎంతోమంది ఉంటారు. వారు కూడా ఇలానే ధర్నాలు చేసి మా రాష్ట్రాల నుండి తెలంగాణ వాళ్లు వెళ్లిపోవాలంటే అప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏదేమైనా ఇది సున్నితమైన అంశం దీనిని రాష్ట్ర ప్రభుత్వం పెద్దది కాకుండా చూడాలి.