రెండు రాష్ట్రాలు విడిపోయి ఎవరి పాలనలో వాళ్లు చక్కగా బతుకుంటే మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు రాజకీయ నాయకులు. ముఖ్యంగా టీడీపీ పార్టీ ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జొన్నలు, రాగులు తినేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం ద్వారా వారికి అన్నం తినడం అలవాటయిందన్నారు.


14 సంవత్సరాలు సీఎం అభ్యర్థిగా చేసిన వ్యక్తి, 40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు మాట్లాడే మాటలేనా అని రాజకీయ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి మాటల వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందన్న వాదన ఉంది. మళ్లీ తెలంగాణకు బియ్యం కూడా తినడం రాదు. మేమే నేర్పించామంటే ఆయన మతి తప్పి మాట్లాడుతున్నారని తెలంగాణలో రాజకీయ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు.


ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణలో టీడీపీ మరింత మైనస్ అవుతుంది తప్ప ఏ మాత్రం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఇప్పటికే జిరోగా మారిపోయింది. పోయిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని పరిస్థితి. అందరూ బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. ఎవరో అభిమానం ఉన్న కార్యకర్తలు గ్రామాల్లో ఒకరిద్దరూ తప్ప అందరూ వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. అయినా తీరు మార్చుకోని చంద్రబాబు  ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని తెలంగాణలో మరింత దూరం  చేస్తున్నారు.


తెలంగాణకు అనుకూలం అని చంద్రబాబు, వైఎస్ లు ఆనాడు లెటర్లు ఇచ్చి అనంతరం సమైక్యాంద్రకు మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. వీరు ఆడిన డ్రామాలు చివరకు రాష్ట్రాన్ని విభజించే వరకు తీసుకొచ్చాయి. అయినా చంద్రబాబు తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పామని అనడం చాలా దారుణమంటున్నారు తెలంగాణ జనం. ఈ వ్యాఖ్యలపై ప్రజలు, రాజకీయ నాయకులు చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: