
ఇప్పుడున్న అవకాశాలు జనసేన, కమ్యూనిస్టులు, టీడీపీ పొత్తు కుదరొచ్చు. లేదా జనసేన, బీజేపీ, టీడీపీ అయినా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఈ కూటమిలో పవన్ కల్యాణ్ కు సీఎం పదవి ఇస్తామంటే బీజేపీ ఒప్పుకొనే అవకాశం ఉంది. కానీ టీడీపీ మాత్రం దానికి ససేమిరా అంటుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి పోటీ చేయాలనుకున్న అసేంబ్లీ సీట్ల పంపకం విషయంలో ఎక్కడో చోట గొడవ జరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ జనసేన పొత్తుకు బీజేపీ రెడీగా ఉంది. టీడీపీ జనసేన పార్టీతో పొత్తుకు జనసేన రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బీజేపీ, టీడీపీ జనసేన కలవడానికి బీజేపీ ఇంకా అయిష్టంగానే ఉంది.
పవన్ ఢిల్లీ వెళ్లి చెప్పినా కూడా బీజేపీ అధిష్టానం టీడీపీతో కలవడానికి ఇష్టంగా లేనట్లే కనిపిస్తోంది. అసలు పొత్తుల అంశం అనేది జనసేన కు అవసరం తప్ప మిగతా పార్టీలకు అవసరం లేనట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి జోరు మీద ఉంది. బీజేపీ గెలవకపోయినా పర్వాలేదు. టీడీపీతో పొత్తు వద్దనే సంకేతాలే వినిపిస్తున్నాయి. మరి జనసేన ఏ పార్టీ వైపు వెళుతుందో చూడాలి.