వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలు వారి పర్పార్మెన్స్ గురించి సర్వే చేయించారు. ఈ సర్వే లో ఆయనకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఎవరి పర్పార్మెన్స్ బాగుంది. ఎవరిది బాగో లేదు. ఎవరు బెటర్ గా ఉన్నారనే వివరాలు బయటకు వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితి ఇలా ఉంది.


వచ్చే ఎన్నికల్లో గెలుపొటములు నిర్ణయించే విధంగా సర్వే చేశారు. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించుకున్నారు. గ్రీన్ అంటే అక్కడి ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు. ఎలాంటి ఢోకా లేదని, ఆరెంజ్ అంటే ఇంకా కాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నట్లు వాటిని అధిగమించి మెరుగ్గా ముందుకెళితే ఆరెంజ్ జోన్లలో గెలుపు బాట పట్టవచ్చని తెలుస్తోంది. కానీ రెడ్ జోన్ల తోనే అసలైన ఇబ్బంది ఎదురవుతోంది.


అయితే పాత పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అచంట, ఉంగుటూరు, నర్సాపురం, పాలకొల్లు, ఉండి, తణుకు, తాడేపల్లి గూడెం,నిడదవోలు రెడ్ జోన్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఓటమి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కొవ్వూరు, చింతలపూడి, దెందూలూరు, భీమవరం ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని తెలుస్తోంది. అంటే పరవాలేదు. మరింత మెరుగ్గా పనిచేస్తే అక్కడ విజయం సాధించవచ్చని తెలుస్తోంది. ఎలూరు, గోపాలపురం, పోలవరం మాత్రమే ఈజీగా గెలవవచ్చని తెలుస్తోంది. కాబట్టి ఈజీగా గెలువచ్చనే నియోజకవర్గాలు మూడు, గెలుపు అవకాశాలు ఉన్నవి నాలుగు మాత్రమే.


అంటే ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు, మిగతా 8 నియోజకవర్గాల్లో ఓటమి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ సర్వే ద్వారా వైసీపీ తమ అభ్యర్థులకు ఏం చెబుతుంది. వారిని ఎలా సిద్దం చేస్తుంది. గెలవాలంటే ఎలాంటి ప్రణాళికలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: