రాయలసీమలో ఈ దఫా భారీగా పుంజుకుంటామని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఎక్కువ సీట్లు రాకపోవచ్చు, కానీ గతంలో కన్నా ఎక్కువ వస్తాయని అంటున్నారు. క్రిందటి సారి 52కు గాను మూడే మూడు గెలిచారు. ఒక పక్కన పయ్యావుల కేశవ్, మరో పక్కన బాలకృష్ణ ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు తప్ప మిగిలిన అందరూ దెబ్బ తిన్నారు.


అంతకు ముందు 2014లో  మిగతా చోట్ల తక్కువ వచ్చినా సరే అనంతపురంలో గట్టిగానే ఓట్లు వచ్చాయి. అంతకు ముందుతో పోల్చుకుంటే చిత్తూరులో కూడా బెటరే. కానీ ఈ దఫా మొత్తం కలిపితే 20-22 సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  పెర్ఫార్మెన్స్ బట్టి జగన్ తన  ఎమ్మెల్యేలకు ఇచ్చిన రిపోర్ట్ బట్టి చూస్తే, నియోజక వర్గాలు అక్కడ 14 గ్రీన్ లెవల్ లో గ్యారెంటీగా గెలుస్తుందని వాళ్ళు వేసుకున్న అంచనాన్ని బట్టి కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ గెలుస్తారని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తిలో బి.యం. మధుసూదన్ రెడ్డి, పలమనేరులో వెంకటేష్ గౌడ, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారని తెలుస్తుంది.


అయితే ఇక్కడ వాళ్ళ అబ్బాయి పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఐదింటికి గెలుపు అవకాశాలు బాగా ఉన్నాయని, అదే సందర్భంలో ఆరంజ్ మార్కులో ఉన్న వాళ్ళ లిస్టులో తిరుపతి భువన కరుణాకర్ రెడ్డి, తంబన పల్లి ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి నవాజ్ భాష, నగరి రోజా వీళ్ళు నలుగురు ఆరంజ్ లో అంటే సాటిస్ఫ్యాక్టరీలో ఉన్నారని, వాళ్ళకు గట్టి పోటీ ఉంటుందనేటువంటి విషయం వీళ్ళు చెబుతున్నారు.


రెడ్ స్థానాల్లో పీలేరు చింతల రామచంద్ర రెడ్డి, సత్యవేడు ఆదిమూలం, గంగాధర్ నల్లూరు నారాయణస్వామి చిత్తూరు శ్రీనివాసులు ఈ నలుగురు,ఈ నాలుగు సీట్లు గెలుపుకి తక్కువ అవకాశం ఉన్నాయనేటువంటిది జగన్ తన ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి నివేదికలో బయటపడిన తాజా అంశం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: