యూపీలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చేసిన నేరాలు, దారుణాలు అన్ని ఇన్నీ కావు. ఓ కేసులో కోర్టు నుంచి మెడికల్ టెస్టులకు తీసుకెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు అతీక్ ను  కాల్చి చంపారు. అతీక్ ను గొప్ప వ్యక్తిగా కీర్తించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకుడిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అతీక్ అహ్మద్ చేసిన నేరాల చిట్టా చాంతడంతా ఉంటుంది. ఎందుకంటే అతీక్ అహ్మద్ ఎంపీగా, ఎమ్మెల్యేగా కాకముందు గ్యాంగ్ స్టర్ గా ఉండేవాడు. కానీ ఎంపీ, ఎమ్మెల్యే అయిన తర్వాత డైరెక్టుగా బెదిరించడం మొదలు పెట్టాడు. ఎంతో మందిని హత్య చేయించాడనే కేసులు ఉన్నాయి.


ఇలా ఒక్కటేమిటి చేయని నేరాలు లేవంటే ఎవరూ నమ్మరు. అలాంటి వ్యక్తిని మతం ముసుగులో వెనక్కి వేసుకొస్తున్నాయి గల్ప్ దేశాలు. ఇన్ని రోజులు చేసిన దారుణాలను  పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి  ఇండియా హిందువులు ముస్లింలను చంపేస్తున్నారని గల్ప్ దేశమైన బెహ్రయిన్ లో ఉండే నాయకులు తెగ బాధపడిపోతున్నట్లు తెలుస్తోంది.


వేల కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి గురించి వీళ్లు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదని చాలా  మంది రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. మతం కంటే మనిషి మంచివాడా.. ఎలాంటి పనులు చేశాడు. ఎంతమందిని రౌడీ యిజం పేరుతో చంపించాడనే వివరాలు తెలుసుకోకుండా వెనక్కి వేస్తున్నాయి.


సెటిల్ మెంట్లు, దందాలు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో దారుణాలకు యూపీలో ప్రధాన కర్తగా నిలిచింది అతీక్ అహ్మద్.  హత్యలు, లూటీలు చేయిస్తున్నప్పుడు తప్పు చేస్తున్నాడని ఒక్క నాడైనా ప్రశ్నించని గల్ప్ దేశాలు, ఇప్పుడు ఏకంగా ఇండియాలో ఏదో జరిగిపోతుందని తెగ బాధపడిపోతున్నాయి. అంటే అతీక్ అహ్మద్ చేసిన నేరాలు కేవలం ముస్లిం అయినంతా మాత్రాన క్షమించాల్సిందేనా.. ఎలాంటి తప్పు చేశాడు. ఎన్ని హత్యలు చేశాడనే విషయాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారు. ఇలాంటి  మత మౌఢ్యం నుంచి  గల్ప్ దేశాలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: