టైమ్స్ నౌ దేశవ్యాప్తంగా చేసిన సర్వేలను బట్టి అది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 నుండి 25 సీట్లు వస్తాయని చెప్పడం అయితే జరిగింది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సిపి  ఏడాదికి ఎనిమిది కోట్ల వరకు టైమ్స్ నౌ కి ఇస్తుంది, అందుకనే ప్రచారాన్ని డైవర్ట్ చేస్తుంది. మేము ఆ ట్రాప్ లో పడబోమని  తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్లుగా తెలుస్తుంది.


అయితే ఇదే టైమ్స్ నౌ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పది సీట్లు, బీఆర్ఎస్ కి ఆరు సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. అయితే అక్కడ అంత‌ రచ్చ జరగలేదు. అయితే ఇప్పుడు ఒక్కో ఛానల్ తమ సర్వేల వివరాలను చెప్పడం అయితే జరుగుతుంది. జన్ లోక్ పాల్  సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ కు 49, భారతీయ జనతా పార్టీకి 33, కాంగ్రెస్ కు 27, బీఎస్పీ కి 3, ఎంఐఎం కి 7, ఇతరులకు 6 వస్తాయట.


అంటే బీఆర్ఎస్ ఇక్కడ ఆధిక్యంలో ఉంది కాబట్టి బిఆర్ఎస్ దే ప్రభుత్వం, కానీ సంకీర్ణ ప్రభుత్వం అవుతుందట. ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళకున్న 117 కు 120 వేసుకుంటే 60-59సీట్లు వస్తే చాలు 49కి, ఎంఐఎం కు7 అంటున్నారు కాబట్టి, అదర్స్ 6 అంటున్నారు కాబట్టి ఏడు ఆరు కలిపి 13, 49 కలిపితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఒకవేళ ఇంకా తగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.


ఎందుకంటే బిజెపికి 33 ఉంది కాబట్టి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బిఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితికి అవకాశాలు అధికంగా ఉన్నాయని ఈ సర్వే వాళ్ళు చెప్తున్న అంచనా. మరి రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లలో ఏ రాష్ట్రంలో ఎవరు వస్తారు అనేది చూచాయిగా తెలుస్తున్నా ఖచ్చితంగా చెప్పడం అయితే కష్టమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR