
అందులో బోపాల్ కు చెందిన వారు, హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అయితే మధ్య ప్రదేశ్ లోని బోపాల్ కు చెందిన 11 మంది ఉగ్రవాద సానుభూతిపరులు, హైదరాబాద్ కు చెందిన 5 గురు ఉన్నట్లు వీరిని గుర్తించి అరెస్టు చేశారు. వీరి వద్ద జిహాద్ సాహిత్యంతో పాటు ఎయిర్ ఫిస్టల్స్, గన్స్, ఇంకా అనేక రకాల ఆయుధాలు దొరికినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కేంద్ర నిఘా సంస్థ చేసిన హెచ్చరికలతో ఈ దాడులు జరిగాయి. రాడికల్ ఇస్లామిక్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా చాప కింద నీరులా దీన్ని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించారు. అయితే వీరిని పట్టుకోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారయ్యారు. హైదరాబాద్ లో ఇలా ఉగ్రవాద మూలాలు ఉన్న యువకులు దొరకడం ఇదే మొదటి సారి కాదు. ఎంతో మంది ఉగ్రవాదులు గతంలో దొరికారు.
చాలా మందికి హైదరాబాద్ లో షెల్టర్ దొరకడం చాలా దారుణం.. వారికి ఎవరూ సహకరిస్తున్నారనే విషయాలను కూడా నిఘా సంస్థలు పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఉగ్రవాద భావజాలాల్ని పెంచి పోషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.