ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బాధ్యాతాయుత‌మైన  ప్ర‌తిప‌క్ష‌హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకు త‌గ్గట్టుగా ప్ర‌వ‌ర్తించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు క‌రోనా ప్ర‌భావంతో రాష్ట్రంలో భయాందోళ‌న ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు భ‌రోసాగా నిల‌వాల్సింది పోయి ఆందోళ‌న క‌లిగించే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, క‌రోనా వ్యాప్తి చెందుతోంది, ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు పాల్ప‌డుతోంది. వాస్త‌వానికి క‌రోనా నివార‌ణ‌, నియంత్ర‌ణ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి మోదీ స‌హా ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కొనియాడ‌డం విశేషం.

 

అయితే క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏకంగా 10ల‌క్ష‌ల టెస్టు కిట్ల‌కు దక్షిణ కొరియాకు ఆర్డ‌ర్ పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇందులో దాదాపు స‌గం వ‌ర‌కు రాష్ట్రానికి చేర‌డం జ‌రిగింది. అనుమానం క‌లిగిన ప్ర‌తీ ఒక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అందుకే కేసుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతూపోతోంద‌న్న వాద‌న ఉంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముంద‌న్న విష‌యం ప‌క్క‌న పెడితే ప్ర‌భుత్వం చేసిన ప్ర‌తి ప‌నిలో త‌ప్పులు వెత‌క‌డ‌మే టీడీపీ ప‌నిగా పెట్టుకుంద‌న్న విమ‌ర్శ‌లు ఇప్పుడు ప్ర‌జానీకం నుంచే వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు లాంటి సీనియ‌ర్ రాజ‌కీయ నేత త‌న స్థాయికి త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని, పార్టీలోని కొంత‌మంది నాయ‌కుల‌తో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయించ‌డం మానుకోవాల‌ని ప్ర‌జానీకం అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ బాధ్యాతాయుత‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చింది లేదు.  వైసీపీ క‌రోనాను నియంత్ర‌ణ చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌ని రోటిన్ విమ‌ర్శ‌లు చేస్తోంది. వాస్త‌వానికి టీడీపీ నేత‌లు ఎక్క‌డా కూడా క‌రో్నా నియంత్ర‌ణ‌, నివార‌ణ చ‌ర్య‌ల్లో ఆక్టివ్‌గా ఉన్న‌ది లేదు. ఆపార్టీ క‌రో్నా నివార‌ణ‌కు ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు లేవు. ప్ర‌జారోగ్యానికి ప్రమాదం ఏర్ప‌డిన‌ప్పుడు భ‌రోసాగా నిల‌వాల్సిన రాజ‌కీయ పార్టీ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోందని టీడీపీ పై  విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: