జూపూడి ప్రభాకర్ రావు.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు బాగా వినిపించిన పేరు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఊసే లేదు.. అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నరా..? లేదా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే జూపూడి ప్రభాకర్ రావు మళ్ళీ యాక్టివ్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఆయన కన్ను ఒక పదవిపై పడ్డట్టు సమాచారం. ఇందుకోసం ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నిస్తునట్టు సమాచారం.

 

వాస్తవానికి జూపూడి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే ఈ స్థాయికి ఎదిగారు. రాజశేఖర రెడ్డి ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. వైఎస్ మరణం తర్వాత జూపూడి జగన్‌తో కలిసి నడిచారు. వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. కానీ 2014 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయన్ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. అప్పటి వరకూ వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న జూపూడి టీడీపీలో చేరిన తర్వాత జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

 

కాగా, 2019 లో జగన్ అధికారంలోకి రావడంతో.. వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు జూపూడి. పార్టీలో చేరిన అనంతరం మళ్ళీ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు జూపూడి. ఆ తర్వాతి కాలంలో సైలెంట్ గా ఉన్న జూపూడి.. మళ్ళీ యాక్టివ్ అయినట్టు తెలుస్తుంది. ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవుల భర్తీపై వైఎస్సార్‌సీపీ ఫోకస్ పెట్టింన సంగతి తెలిసిందే. ఈ పదవి కోసమే జూపూడి యాక్టివ్ అయినట్టు సమాచారం. ఈ మేరకు ఆయన సీఎం జగన్ ని కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ పదవి తనకే ఇవ్వాలని కూడా కొరినట్టు సమాచారం.

 

అలాగే 2019 ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాదాసి వెంకయ్యను ఆ నియోజకవర్గం ఇంచార్జీగా నియమించింది ఆ పార్టీ అధిష్టానం. అయితే మాదాని వెంకయ్య స్వతహాగా డాక్టర్ కావడం, రాజకీయాలు పెద్దగా తెలియకపోవడంతో కొండపి నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో తనకు ఇంచార్జీ పదవిని ఇవ్వాలని జూపూడి ప్రభాకర్ రావు ఇటీవలే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కొరినట్టు తెలుస్తుంది. మరి జూపూడి ప్రభాకర్ రావు విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: