అందుకే జగన్ పరిపాలనలో అభివృద్ధి కంటే సంక్షేమం కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే సంక్షేమం ఒక్కటే 30 ఏళ్ల పాలనకు పునాదులు వేయలేదు. సంక్షేమం, ప్రగతి రెండు రెండు కళ్లుగా పాలన సాగితేనే.. సుదీర్ఘ కాలం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్ ఆ దిశగా ఆలోచిస్తున్నాడు. తాజాగా ఉచిత విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు కొనసాగించేలా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించే ‘వైఎస్సార్ ఉచిత విద్యుత్’ పథకాన్ని మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలు చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ పథకం కోసమే ప్రత్యేకంగా చేపట్టిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. తొలిదశలో.. అనంతపురం, కడప, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలుస్తున్నారు.
అయితే టెండర్లు అంటేనే అవినీతి అన్న తరహాలో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మార్చేందుకు ఆయన ముందు చూపుతో తీసుకొచ్చిన ప్రక్రియ జ్యూడిషియల్ ప్రివ్యూ.. ఇప్పుడు ఈ టెండర్లలోనూ ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు జగన్ సర్కారు పంపింది. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరిగే టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జ్యూడీషియల్ ప్రివ్యూ అధికారిక వెబ్సైట్ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జ్యూడీషియల్ ప్రివ్యూ.ఏపీ.జీవోవీ.ఇన్’లో పొందుపర్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి