ఈ విషయంలో ఆ పార్టీలోని నాయకులు అంతా ఏకాభిప్రాయంతో దూసుకెళుతున్నారు. అసలు
బిజెపి తరహాలో ఏకాభిప్రాయం లేక
కాంగ్రెస్ పార్టీలు నామరూపాలు లేకుండా తెలంగాణలో చిన్నాభిన్నం అయిపోయింది.
కాంగ్రెస్ అలా బలహీనం కావడంతో
బిజెపి తెలంగాణలో బలం పెంచుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే. గ్రేటర్ లో గెలిచిన ఆనందం కూడా లేకుండా
బిజెపి పట్టు పెంచుకున్న తీరు టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుపు అవకాశాలపై అప్పుడే అనుమానాలు బయల్దేరడంతో, ఆ
పార్టీ నాయకులు ఆందోళన పెరిగిపోతోంది. దానికి ముందుగానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో, టిఆర్ఎస్ లో మరోసారి టెన్షన్ మొదలైంది. 2018 ఎన్నికలు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నోముల నర్సింహయ్య
కాంగ్రెస్ అభ్యర్థి
జానారెడ్డి గెలిచారు.
ఆ ఎన్నికల్లో
బిజెపి కి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న
బిజెపి ఆ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నా, ఎప్పటి నుంచో అక్కడ ఎన్నికలకు సిద్ధమైపోతుంది. పరిస్థితులను తలచుకుని టిఆర్ఎస్ నేతలు కంగారు పడిపోతున్నారు. ఒకవేళ అక్కడ ఫలితం తేడా కొడితే, కోలుకోలేని విధంగా టిఆర్ఎస్ దెబ్బ తింటుందని , అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం పైన ఇప్పుడు టిఆర్ఎస్ వ్యూహ రచనలు చేసే పనిలో ఉంది. ఏది ఏమైనా
బిజెపి తెలంగాణలో ఎదుగుతున్న తీరు టిఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అనడం లో సందేహం లేదు.