మరోవైపు రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. మరియుపోల్‌లో రష్యా దాడులు యుద్ధ నేరం అంటూ అభివర్ణించారు. శాంతికి మారుపేరైన మరియుపోల్‌లో రష్యా సేనల దాడులు తీవ్రవాద చర్యలను తలపిస్తున్నాయన్నారు. రష్యాతో జరుగుతున్న చర్చలు సాధారణమైనవి కావని అవి అత్యవసరమని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుతోందని జెలెన్‌స్కీ అంటున్నారు.
ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తమ సైనికుల మృతదేహాలను తీసుకునేందుకు కూడా రష్యా బలగాలు అనుమతించడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఆరోపించారు. యుద్ధం విషయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు కూడా రష్యా పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యాతో సన్నిహిత సంబంధమున్నరాజకీయ పార్టీల కార్యకలాపాలను సస్పెండ్ చేస్తూ జెలెన్‌స్కీ తీసుకున్న ఆదేశాలు ఆ దేశంలో రాజకీయంగా కలకలం రేపాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు దేశంల చీలిక తీసుకొస్తాయన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. శత్రువుపై ఉమ్మడిగా పోరాడాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేశ ఐక్యత చెదిరిపోతుందేమో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలను రష్యా తనకు అనుకూలంగా మలచుకుని అంతర్జాతీయంగా ఉక్రెయిన్ ను మరింత ఒంటరిని చేసే ప్రమాదం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరి మాటా వినడం లేదు కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి